SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ సీజన్ ను శుభారంభం చేసింది. తన విన్నింగ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తోంది. గత ఏడాది ఐపీఎల్ సెమీస్, ఫైనల్స్ గెలిచిన జట్టు ఈ ఏడాది గ్రాండ్ ఓపెనర్ తో వేట మొదలుపెట్టింది. శనివారం రాత్రి బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది. 202 పరుగులను ఊది అవతల పడేసింది.
బ్యాటింగ్ లో పడుతూ లేస్తూ 200 పరుగుల మార్క్ ను దాటినప్పటికీ.. బౌలర్లు సన్ రైజర్స్ ను నిలువునా ముంచారు. పాట్ కమ్మిన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల బౌలింగ్ డిపార్ట్ మెంట్ అత్యంత బలహీనంగా తయారైందనే విషయం ముందుగా తెలిసినప్పటికీ.. అందులో ఉన్న లోపాలను కనీసం సరిదిద్దుకోలేకపోయిందా టీమ్. రాయల్ ఛాలెంజర్స్ పటిష్టమైన బ్యాటింగ్ ప్రదర్శన ముందు తేలిపోయింది. బౌలింగ్ విభాగం బలహీనకావడం, సమన్వయం లేని ఆటతీరు ఈ పరాజయానికి ప్రధాన కారణాలు.

202 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా ఆకట్టుకున్నారు. విరాట్ కోహ్లీ 38 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేయగా, దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లోనే 61 రన్స్ సాధించాడు. పవర్ ప్లేలో వారి 101 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను సన్ రైజర్స్ నుండి దూరం చేసింది. ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ విభాగం తీవ్రంగా నిరాశపరిచింది. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతోపాటు కీలకమైన వికెట్లు తీయలేకపోయారు. 200 పరుగులకు పైగా టార్గెట్ ఉన్నా కూడా దాన్ని కాపాడుకోవడంలో చేతులెత్తేశారు.
పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో పరుగులను ఏ మాత్రం నియంత్రించలేకపోయారు. ఏ ఒక్కరు కూడా ఆర్సీబీ బ్యాటర్లను భయపెట్టలేకపోయారు. వారిని కట్టడి చేయలేకపోయారు. కనీసం ఒత్తిడిలోనైనా నెట్టడంలో విఫలం అయ్యారు.కీలక ఫీల్డింగ్ తప్పిదాలు సన్ రైజర్స్ కు తీరని నష్టాన్ని కలిగించాయి. విరాట్ కోహ్లీ క్యాచ్‌ను జారవిడవడంతో ఆర్సీబీ పట్టు బలపడేలా చేసింది. అక్కడి నుండే ఆర్సీబీ గేర్ మార్చింది. మొమెంటర్ మారింది.
ఈషాన్ మలింగ ఒకే ఓవర్ లో నాలుగు వైడ్లు వేయడం, అదే ఓవర్ లో రజత్ పటిదార్ సిక్సర్లతో విరుచుకుపడటంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఏ ఒక్కరు కూడా బౌలింగ్ కోటాను పూర్తి చేయలేదు. ఉన్నంతలో జయదేవ్ ఉనద్కత్,, కొత్త ఆటగాడు డేవిడ్ పేన్ ఫర్వాలేదనిపించుకున్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి అట్టర్ ప్లాప్. హర్షల్ పటేల్ ఓవర్ కు 14కు పైగా పరుగులను సమర్పించుకున్నాడు.












Click it and Unblock the Notifications