వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే!

వాస్తు ప్రకారం ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ వాటికి కొన్నిరకాల చిట్కాలుంటాయి. వాటిని అనుసరిస్తే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు ఎదురుకావు. ఇంట్లో మనం ఐదు రకాల మొక్కలు పెంచుకుంటే ఇక్కట్లు ఉండవని నిపుణునలు తెలియజేస్తున్నారు. ఆ ఐదు రకాల మొక్కలు ఏంటి? వాటివల్ల ఏం జరుగుతుంది? ఎలా కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.

గులాబీలు ప్రేమకు చిహ్నాలు. వాస్తు ప్రకారం వీటిని పెంచుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇవి సంపదకు కూడా చిహ్నం. నైరుతిలో పెంచడంవల్ల సంబంధాలు బలపడతాయి. గులాబీ మొక్కలకు ముళ్లు ఉండకూడదు. ఎండిపోయిన మొక్కలను ఉంచకూడదు.

మల్లెలు..

వాస్తు ప్రకారం మల్లెలు భావోద్వేగాలను పెంచుతాయి. వీటివాసన ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమిని తగ్గించడంతోపాటు మెదడును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. బాల్కనీల్లో పెంచండి.తూర్పు లేదా ఈశాన్య దిక్కుల్లో పెంచుకోవాలి.

According to Vastu here are 5 plants you should grow at home for wealth

మందారం..

మందార మొక్కలు సానుకూల శక్తులను ఆహ్వానిస్తాయి. మందారపువ్వు చాలా శుభసూచికం. దోషాలను తీసేస్తుంది. సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. వీటిని తూర్పు లేదా ఉత్తర దిశలో నాటాలి.

బిళ్లగన్నేరు

పూలు పూసే బిళ్లగన్నేరు ఏడాది పొడవునా కాస్తుంది. ఇంట్లో ఎవరైనా మూడ్ బాగోలేదంటే వాటిని మారుస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గకుండా చూస్తుంది. ఎండను, తక్కువ నీటిని కూడా తట్టుకుంటుంది. కుటుంబ సభ్యులంతా ప్రశాంతంగా ఉంటారు. ఆగ్నేయం లేదంటే వాయువ్యంలో పెంచాలి.

బంతిపూలు..

బంతిపూలు సానుకూల శక్తిని పెంచుతాయి. మనుషులతో భావోద్వేగ సంబంధాలను కలిగిస్తాయి.
సానుకూల శక్తిని నింపుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఉండేలా చూస్తాయి. వీటిని ప్రధాన ద్వారం దగ్గర పెంచాలి. ఉత్తర దిశ అయితే ఇంట్లోకి సంపద ప్రవహిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+