Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం

తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి.

ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

April Horoscope Predictions for Individuals Born Under the Hasta Chitta or Swati Nakshatras

హస్త నక్షత్రం (కన్యా రాశి)

హస్త నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండటం ఉత్తమం. రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. శుభకార్యాల కోసం ప్రయాణాలు చేస్తారు. కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. తీవ్ర అలసటకు గురవుతారు. మంచి ఆహార నియమాలు పాటించడం మంచిది. బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా గణపతిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది.

చిత్త నక్షత్రం (కన్యా రాశి 1, 2 పాదాలు & తులా రాశి 3, 4 పాదాలు)

చిత్త నక్షత్రం వారికి ఈ నెలలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు తలుపు తడతాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్థలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కంటికి సంబంధించిన సమస్యలు లేదా మోకాళ్ల నొప్పులు వస్తాయి. జాగ్రత్త వహించాలి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడం శుభప్రదం.

స్వాతి నక్షత్రం (తులా రాశి)

స్వాతి నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నెల చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఇల్లు లేదా స్థలం కొనుగోలుకు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. శుక్రవారం రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+