మందుబాబులకు పండుగే- అందుబాటులోకి కొత్త బ్రాండ్లు, ధరలు తగ్గింపు..!!
ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ప్రతీ మద్యం సీసాకు ఒక నెంబర్ కేటాయించాలని నిర్ణయించింది. అదే విధంగా పాపులర్ బ్రాండ్లను తిరిగి ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రముఖ బాండ్ల ధరలు తగ్గింపు తో మద్యం అమ్మకాలు పెరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏపీలో పాపులర్ బ్రాండ్ల విక్రయాలు పెరిగాయి. కొన్ని కంపెనీలు ధరలు సైతం తగ్గించాయి. ఫలితంగా మద్యం అమ్మకాల శాతం పెరిగింది. గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానం కారణంగా ఆదాయం పైన ప్రభావం పడింది. గతంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చిన తరువాత నూతన మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది. దీనికి అనుగుణంగా తిరిగి పాపులర్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటుగా రూ 99 కే క్వార్టర్ మద్యం ప్రవేశ పెట్టింది. ఫలితంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సరిహద్దు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 40శాతానికి పైగా అమ్మకాలు పెరిగాయి. దీంతో రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 87 పాపులర్ బ్రాండ్లు తిరిగొచ్చాయి. వాటి అమ్మకాలు గత ప్రభుత్వంలో 20.7 శాతంగా ఉంటే, ఈ ప్రభుత్వంలో 74 శాతానికి పెరిగాయి. 50 బ్రాండ్ల ధరలను కూటమి ప్రభుత్వం తగ్గించింది.

ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో నకిలీ నివారణ కోసం వినూత్న పద్దతి అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు నకిలీ మద్యం అమ్మకాలను అడ్డుకునేందుకు మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ప్రతీ సీసా పైన క్యూ ఆర్ కోడ్ ద్వారా వినియోగదారుడు మద్యం క్వాలిటీ తెలుసుకునే అవకాశం ఉంది. కాగా, దేశంలోనే మొదటి సారి ప్రతీ మద్యం సీసా పైన లిక్కర్ ఐడింటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలని నిర్ణయించింది. మద్యం బ్రాండ్.. తయారీ తేదీ తో పాటుగా సీసాకు నెంబర్ కేటాయిస్తూ ప్రతీ సీసా పైన ముద్రిస్తారు. ప్రతీ వినియోగదారుడు ఈ నెంబర్ ఆధారంగా మద్యం కొనుగోలు చేసే విధంగా అవగాహన పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. తాజాగా ఎక్సైజ్ శాఖ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా.. ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని తాజాగా జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు సూచించారు. జియో ట్యాగింగ్ ద్వారా మద్యం సరఫరాలో పారదర్శకత వస్తుందని, ట్రాకింగ్ షాపుల రేషనలైజేషన్పైనా దృష్టి పెట్టాలని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. బాటిల్ తిరిగి ఇస్తే డిఆర్ఎస్ (డిపాజిట్ రిటర్న్స్ స్కీమ్) కింద నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తు నట్లు చెప్పారు.
-
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..!












Click it and Unblock the Notifications