గోవా మాజీ సీఎం విల్ఫ్రెడ్ డిసౌజా కన్నుమూత
పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి విల్ఫ్రెడ్ డిసౌజా శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశార. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత రాత్రి శ్వాస కోశ సంబంధ వ్యాధితో బాధపడుతుండటంతో ఆయన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న తరుణంలో శుక్రవారం ఉదయం 9:15 గంటలకు గుండెనొప్పితో తుది శ్వాస విడిచినట్లు డాక్టర్ శేఖర్ సాల్కర్ తెలిపారు. విల్ఫ్రెడ్ డిసౌజా మూడు సార్లు గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు.

వృత్తిరీత్యా సర్జన్ అయిన విల్ఫ్రెడ్ డిసౌజా యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌లో డబుల్ ఫెలో పొందిన అతి కొద్ద మంది వ్యక్తుల్లో ఒకరు. 1974లో కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
భారత మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ చేతుల మీదగా డాక్టర్ బీసీ రాయ్ అవార్డును కూడా అందుకున్నారు. గోవా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి గెలిచి తనదైన ముద్రను వేయడమే కాకుండా, అనతికాలంలో ఉన్నత పదవులను పొందారు.
గోవా ముఖ్యమంత్రిగా తొలిసారిగా 1993లో పదవి బాధ్యతలను స్వీకరించారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన 1980ల్లో గోవాలో కాంగ్రెస్ పాగా వేసేందుకు ముఖ్య భూమికను పోషించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications