నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!
ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారింది అస్సాం భామ "కయాదు లోహర్". 2021లో వచ్చిన కన్నడ చిత్రం 'మొగిల్ పేట' సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత 2022లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'అల్లూరి' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తార్వాత పలు భాషల్లో అరడజనుకు పైగా చిత్రాల్లో నటించింది. కానీ అవేవీ ఈ అమ్మడుకు అదృష్టాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. డైరెక్టర్ కం హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన "డ్రాగన్" సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ భామ. ఆమె గ్లామర్ తో పాటు నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోవడంతో.. తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే తమిళంలో కూడా యంగ్ హీరోలు చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది.
అంతే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రాణిస్తుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో 'అల్లూరి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కయాదు.. ఇటీవల విశ్వక్ సేన్‌కి జోడీగా 'ఫంకీ' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆమె అందానికి మాత్రం ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం "ది ప్యారడైజ్" లో నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తాజాగా కయాదు మరో బంపరాఫర్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది.

సక్సెస్ మిషన్ దర్శకుడు అనిల్ రావిపూడి.. వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా, కల్యాణ్ రామ్ జోడీగా కయాదు లోహర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి సినిమాలో అవకాశం దక్కించుకోవడం అంటే ఈ ముద్దుగుమ్మ కెరీర్ మలుపు తిరిగినట్లేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కయాదు తనదైన శైలిలో అందం, అభినయంతో మెప్పిస్తే స్టార్ హీరోయిన్ గా మారుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు స్టార్ హీరోల సరసన క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. దీంతో భారీ అంచనాలతో రాబోతున్న ఈ చిత్రాల్లో నటించే ఛాన్స్ రావడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ చిత్రాలలో ఏ మూవీ సూపర్ హిట్ అయిన ఈ అమ్మడు కెరీర్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోవడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.
-
హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేస్తుంది..గూస్బంప్స్ గ్యారెంటీ బాసూ -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ???











Click it and Unblock the Notifications