ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో
యంగ్ టైగర్, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాలంటే ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీస్ కూడా ఎదురుచూస్తుంటారు. చిన్న వయసులోనే సినీ కెరీర్ ప్రారంభించి తన డాన్స్, నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. అలాగే ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఆయన సొంతం. ప్రస్తుతం ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ వర్కింగ్ టైటిల్ డ్రాగన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది డ్రాగన్ మూవీ రిలీజ్ కానుంది.
అంతకుముందు దేవర, వార్ 2 లాంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ మూవీతో మరోసారి తనలోని మాస్ అంశాల్ని ప్రేక్షకుల ముందు ఉంచనున్నారు. దాంతో ఈ మూవీపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ బ్లాక్ బస్టర్ విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. దాంతో వీరి కాంబోపై అటు తెలుగుతోపాటు పాన్ ఇండియా రేంజ్ లో ఆసక్తి నెలకొంది.
అయితే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సితార.. ఇలా ఎన్టీఆర్ సాంగ్ కు కాలు కదపడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రంలోని ఆయుధపూజ సాంగ్ కు సితార స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇక సోషల్ మీడియాలో అయినా బయట అయినా మహేష్ కూతురు సితార ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ తన తండ్రి పాటలకు స్టెప్పులేసే సితార.. ఈ సారి కొత్తగా ఎన్టీఆర్ పాటకు డాన్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగాన్ మూవీ చేస్తుండగా.. ఈ మూవీ తర్వాత దేవర-2 సినిమా చేసే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications