నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!
"మోనాలిసా భోంస్లే".. ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయి స్టార్‌గా మారింది. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితం, అలాగే సినీ రంగంలో ఎదురైన అనుభవాలపై సంచలన ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా దర్శకుడు Sanoj Mishraపై ఆమె చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.
2025లో జరిగిన Maha Kumbh Mela సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పూసలు అమ్ముకుంటూ కనిపించిన మోనాలిసా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె సహజ సౌందర్యం, ప్రత్యేకంగా నీలి కళ్లు నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఒక్కరాత్రిలోనే సెలబ్రిటీగా మారిపోయింది. ఈ క్రేజ్ కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు కూడా రావడం ప్రారంభమైంది. అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే ఆమె వ్యక్తిగత జీవితం వివాదాల్లో చిక్కుకుంది.

కాగా కొద్దిరోజుల క్రితం Monalisa Bhosle తన ప్రియుడు Furman Khanను కేరళలోని Thiruvananthapuramలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిపై దర్శకుడు Sanoj Mishra 'లవ్ జిహాద్' అంటూ ఆరోపణలు చేయడంతో వివాదం రాజుకుంది. మరోవైపు మోనాలిసా బంధువు Vijay Bhosle ఆమె మైనర్ అని, ఈ వివాహం చట్టబద్ధం కాదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మోనాలిసా దంపతులు తమ వివాహం పూర్తిగా చట్టబద్ధమని, పరస్పర అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నామని స్పష్టం చేశారు. మతపరమైన ఆరోపణలను కూడా వారు కొట్టిపారేశారు.
ఈ క్రమంలోనే లేటెస్ట్ గా కేరళలోని Kochiలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో Monalisa Bhosle సంచలన ఆరోపణలు చేశారు. తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు Sanoj Mishra తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, పలుమార్లు తన శరీర భాగాలను తాకుతూ లైంగికంగా వేధించాడని ఆమె కన్నీటిపర్యంతమవుతూ వెల్లడించారు. ఆ సమయంలో తనకు 18 ఏళ్లు కూడా నిండలేదని చెబుతూ.. ఆ చేదు అనుభవాన్ని ఇంట్లో చెప్పినా "మొదటి సినిమా కాబట్టి సర్దుకుపోవాలి" అని చెప్పడంతో ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తన వివాహాన్ని 'లవ్ జిహాద్'గా చిత్రీకరిస్తున్న Sanoj Mishraపై ఆమె తీవ్రంగా స్పందించారు. తనపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే ఇలా ఆరోపణలు చేస్తున్నారని, తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాల్లో అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని, మైనర్ బాలికలతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తాడని ఆమె ఆరోపించారు. "అతని సినిమాల్లో ఎవరు నటించాలనుకుంటారు? అతను చాలా చెడ్డ వ్యక్తి" అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
అంతే కాకుండా తమకు ప్రాణహాని ఉందని చెబుతూ కేంద్ర ప్రభుత్వం, కేరళ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల సహాయం కోరారు. ప్రస్తుతం భయాందోళనల మధ్య కేరళలోనే గడుపుతున్నామని తెలిపారు. గతంలో కూడా Sanoj Mishraపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి ఓ యువతిని వేధించిన కేసులో గతేడాది ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మోనాలిసా చేసిన ఆరోపణలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications