హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యహరిశ్చంద్రులా?: చార్మి పిటిషన్‌పై ఆమె, ఎక్సైజ్ తరపు లాయర్ల పోటాపోటీ వాదనలు

డ్రగ్స్ కేసులో సిట్ తనకు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినీ నటి చార్మి సోమవారం వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం ఉదయం విచారించింది. ఈ సందర్భంగా న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి .

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ తనకు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినీ నటి చార్మి సోమవారం వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం ఉదయం విచారించింది. ఈ సందర్భంగా న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి చార్మి తరపున కోర్టుకు వాదనలు వినిపించారు.

రాజ్యాంగ విరుద్ధం

రాజ్యాంగ విరుద్ధం

సీఆర్పీసీ సెక్షన్ 161 సెక్షన్ కింద చార్మికి నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. బలవంతంగా (రక్తం, గోర్లు, వెంట్రుకలు)శాంపిల్స్ సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ నుంచి సిట్ బ్లడ్ శాంపిల్స్ సేకరించిందని ప్రస్తావించారు.

నా పరువు తీశారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దు: సిట్‌పై హైకోర్టుకు చార్మినా పరువు తీశారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దు: సిట్‌పై హైకోర్టుకు చార్మి

Recommended Video

Puri Jagannadh Wife Sensational Comments on Charmi Puri Relation
నోటీసులెందుకు?

నోటీసులెందుకు?

డ్రగ్స్ కేసులో చార్మి నిందితురాలు కాదు, సాక్షి కాదు.. అయినా ఆమెకు సిట్ నోటీసులివ్వడం సరికాదని న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో కోర్టు తీర్పును మంగళవారం మధ్యాహ్నం వెలువరించనుంది.

చార్మి అంటే గౌరవం.. ఎక్కడికైనా..

చార్మి అంటే గౌరవం.. ఎక్కడికైనా..

చార్మిని సాక్షిగానే విచారిస్తున్నామని ఎక్సైజ్ శాఖ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. చార్మి అంటే తమకు గౌరవముందని చెప్పారు. ఆమె అనుమతిస్తే ఆమె ఇంటికి వెళ్లి విచారిస్తామని, లేదంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తామని తెలిపారు. కెల్విన్ ముఠా ఇచ్చిన ఆధారాలతోనే తాము విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.

మరో ముంబైగా..

మరో ముంబైగా..

తాము విచారించిన వారందరి విచారణను వీడియో చిత్రీకరించామని, తమ వద్ద ఆ రికార్డులున్నాయని తెలిపారు. హైదరాబాద్ మరో ముంబైగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసు తీవ్రత కారణంగా తాము విచారణ లోతుగా కొనసాగిస్తున్నామని చెప్పారు.

బలవంతంగా సేకరించడం లేదు..

బలవంతంగా సేకరించడం లేదు..

తాము బలవంతంగా ఎవర్నుంచీ శాంపిల్స్ సేకరించడం లేదని ఎక్సైజ్ తరపున లాయర్ తన వాదనను వినిపించారు. స్వచ్ఛందంగా ఇస్తేనే శాంపిల్స్ తీసుకుంటున్నామని చెప్పారు. నవదీప్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన నుంచి శాంపిల్స్ సేకరించలేదని చెప్పారు.

సత్య హరిశ్చంద్రులా?

సత్య హరిశ్చంద్రులా?

డ్రగ్స్ ఎవరి నుంచి తీసుకున్నారు? ఎలా సరఫరా అయ్యిందనే విషయాలను తెలుసుకునేందుకే తాము విచారిస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం కూడా నటులు మీడియా ముందుకు వెళ్లి వివరాలు చెబుతున్నారని చెప్పారు. సత్యహరిశ్చందులైన వారికి భయమెందుకని లాయర్ ప్రశ్నించడం గమనార్హం. అంతేగాక, చార్మి వేసిన పిటిషన్ కేవలం పబ్లిసిటి స్టంట్ అని, తప్పు చేయకుంటే భయమెందుకని నిలదీశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ర్ ప్రకారం కేసు విచారణ సాగుతోందని స్పష్టం చేశారు. చార్మి అంగీకరిస్తేనే బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తామని చెప్పారు.

English summary
Actress Charmy petition hearing completed in high court in drug racket case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X