బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?
మన తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్. అయితే వీరికి హీరోయిన్ల సమస్య ఎదురవుతోంది. నయనతార, త్రిష, కాజల్, తమన్నా లాంటివారితో ప్రస్తుతం నెట్టుకొస్తున్నారు. ఇతర హీరోయిన్లు వీరితో నటించడానికి ముందుకు రావడంలేదు. దీనికి కారణం వారి వయసు అయితే, మరో కారణం వీరితో నటిస్తే యువ హీరోలు అవకాశాలివ్వరేమోనని జంకుతున్నారు. ఒకసారి సీనియర్ హీరోలతో నటిస్తే ఇతర హీరోలు ఛాన్స్ లివ్వడానికి నిరాకరిస్తారని వెనకడుగు వేస్తున్నారు.
సున్నితంగా తిరస్కరించిన తమన్నా..
పైన మనం చెప్పుకున్న హీరోయిన్లంతా అగ్ర హీరోలతో నటిస్తున్నారు.. యువ హీరోలతో నటిస్తున్నారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం నందమూరి నటసింహం బాలయ్యతో నటించడానికి ససేమిరా అంటున్నారు. చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోల పక్కన నటించిన తమన్నాకు బాలయ్య సరసన నటిస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని బాలయ్య అభిమానులు నిలదీస్తున్నారు.

కాగా తమన్నాకు సీనియర్ హీరోలతో మంచి ట్రాక్ రికార్డు ఉంది. వెంకటేష్‌తో చేసిన 'F2', 'F3' బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి'లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. భోళా శంకర్‌లోనూ మెగాస్టార్‌తో ఆడిపాడింది. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేయబోయే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్‌గా తమన్నాను సంప్రదించగా, ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
తాను సెట్ అవనేమో అనే అనుమానం (balakrishna)..
బాలకృష్ణ (balakrishna) సరసన నటించడానికి తమన్నా ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం తాను సెట్ అవలేనేమోననే అనుమానం. చిరంజీవి, వెంకటేష్‌లతో ఉన్న సాన్నిహిత్యం, వారి బాడీ లాంగ్వేజ్‌కు తను సెట్ అయినట్లుగా, బాలయ్య పక్కన తను ఒదిగిపోలేనని ఆమె భావిస్తున్నట్లు తెలుగు ఫిలిం నగర్ లో టాక్ ఉంది. అందుకే భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా, ఈ ప్రాజెక్టుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చివరకు నయనతార, డింపుల్ హయతిని కథానాయికలుగా ఫిక్స్ చేశారు.
ఇక్కడ గోపీచంద్ ఆలోచించింది ఏమిటంటే.. బాలయ్య పక్కన ఇంతవరకు తమన్నా నటించలేదు కాబట్టి ప్రేక్షకులకు మంచి ఫ్రెష్ జంటను చూసిన అనుభూతి ఉంటుందనునుకున్నాడు కానీ అది కుదర్లేదు. బాలకృష్ణ లాంటి పవర్ ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ హీరోకు హీరోయిన్ ఎవరైనా ఒకటేనని, చివరకు సినిమా అంతా బాలయ్య చుట్టూనే తిరుగుతుందని, కాబట్టి తమన్నా చేయకపోయినా బేఫికర్ అంటున్నారు నందమూరి అభిమానులు.












Click it and Unblock the Notifications