Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డ్రగ్స్ కేసు: జాక్ విచారణలో హీరో రవితేజపై ఆశ్చర్యకర విషయాలు

డ్రగ్స్ కేసులో తెలుగు సినీ హీరో రవితేజకు సంబంధించిన ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసులో జీషన్‌అలీ అలియాస్ జాక్‌ను కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తెలుగు సినీ హీరో రవితేజకు సంబంధించిన ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం సాయంత్రం టీవీ న్యూస్ చానెల్స్‌లో వార్తకథనాలు ప్రసారమయ్యాయి.డ్రగ్స్‌ కేసులో జీషన్‌అలీ అలియాస్ జాక్‌ను కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

జీషన్‌ విచారణలో మరికొందరి పేర్లు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సారి తెరపైకి యువ హీరోల పేర్లు వచ్చే అవకాశం ఉంది. రవితేజకు సంబంధించిన విషయాలను జీషన్ అలీ బయటపెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయయలో రవితేజ, నవదీప్‌కు జీషన్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు సిట్‌ వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Ravi Teja

జీషన్ అలీ దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ తెచ్చి రవితేజకు అందించేవాడని, రవితేజ వాటిని సరఫరా చేసేవాడని అంటున్నారు. జీషన్ అలీ ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. డ్రగ్స్ వ్యవహారంలో కెల్విన్ తర్వాత జీషన్ అలీదే కీలక పాత్ర అని చెబుతున్నారు. జాక్ వస్తే క్రాక్ వచ్చినట్లేనని పబ్‌లో అనేవారని అంటున్నారు. క్రాక్ అని ఓ రకమైన మత్తుపదార్థాన్ని పిలుచుకునేవారని చెబుతున్నారు.

జాక్‌కు ఓ ప్రముఖ సంగీత దర్శకుడితో సంబంధాలున్నాయని అంటున్నారు. జాక్ విచారణలో బుల్లి తెర నటీనటుల పేర్లు కూడా వెల్లడి కావచ్చునని అంటున్నారు. రవితేజను ఎక్సైజ్ సిట్ అధికారులు ఈ నెల 25వ తేదీన విచారించనున్నారు. రవితేజ విచారణ తర్వాత మరింత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

తరుణ్ విచారణలో గోవా ట్రిప్పులు, డ్రగ్ డీల్స్, బినామీ పబ్‌ల వ్యవహారంపై తరుణ్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్నానని తరుణ్‌ సిట్ అధికారులకు చెప్పడంతో సాయంత్రం తరుణ్‌కు బీపీ చెక్‌ చేయించారు. క్లూస్‌ టీం రంగంలోకి దిగడంతో పలు కోణాల్లో తరుణ్‌ను విచారిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+