రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధులను మరింత మంది రైతులకు విస్తరించాలని నిర్ణయించింది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత గత నెలలో ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. కాగా.. పట్టాదార్ పాసుపుస్తకాలు లేని వారికి నిధులు జమ కాలేదు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసింది. ఇక నుంచి వారికి సైతం రైతు భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించారు. రైతు భరోసా నిధుల జమ కోసం ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం విస్తరించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వారి తో పాటుగా భారీ సంఖ్యలో లబ్ది దారులకు కొత్తగా అవకాశం కల్పించనుంది. రైతు భరోసా అర్హుల జాబితాలో లేకుండా.. కొత్తగా కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రేవంత్ సర్కార్ ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని, కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 85 వేల మంది రైతులకు రైతు భరోసా పథకం అమలు కానుంది. వారిలో ఇప్పటికే 62 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను వ్యవసాయ శాఖ ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రైతుల అర్హత, భూమి వివరాలు, పట్టాదారుల నిజానిజాలను నిర్ధారించిన తర్వాత వారం, పది రోజుల్లో తుది జాబితాను సిద్ధం చేయనున్నారు.

త్వరలో రైతుల ఖాతాల్లో నిధుల జమ
అర్హులుగా తేలిన కొత్త రైతులకు ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీల మధ్య యాసంగి (రబీ) రెండో విడత రైతు భరోసా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సీజన్‌లో సుమారు రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్‌లో లబ్ధి పొందిన ప్రతి రైతుకు, ఈ యాసంగిలో కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందనుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో సుమారు 69.39 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున మొత్తం రూ. 8,744.13 కోట్లను కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం పంపిణీ చేసింది. రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో నల్లగొండ జిల్లా 5.22 లక్షల మందితో అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ రైతులకు భరోసా నిధులు ఇక నుంచి రెగ్యులర్ గా అందనున్నాయి.












Click it and Unblock the Notifications