వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ఇంత బిజీ లైఫ్ లోనూ వివాహేతర సంబంధాలు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. అయితే వివాహేతర సంబంధాల్లో మన దేశంలో బెంగళూరు తొలి స్థానంలో ఉన్నట్లు గ్లీడెన్ అనే డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వివాహేతర సంబంధాల కోసం మాత్రమే ఏర్పాటు చేసిన ఈ సైట్ లో భారత యూజర్ల సంఖ్య 40 లక్షలు దాటింది. ఈ విషయాన్ని గ్లీడిన్ డేటింగ్ యాప్ వెల్లడించింది.
అయితే తాజా సర్వే ప్రకారం మొత్తం యూజర్లలో దాదాపు 18 శాతం ఒక్క బెంగళూరు నుంచే ఉన్నారు. ఇక రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, ముంబై, పుణె ఉన్నాయి. ఈ నేపథ్యంలో అర్బన్ నగరాల్లో వివాహేతర సంబంధాలు ఏ విధంగా పెరుగుతున్నాయో అర్థం అవుతోంది. అలాగే దేశంలోని టైర్ 2 నగరాల్లోనూ యూజర్లు పెరుగుతున్నట్లు గ్లీడెన్ సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ఇది ఒక కల్చరల్ షిఫ్ట్ గా ఆ డేటింగ్ యాప్ భావిస్తోంది.
ఈ యూజర్లలో చాలా మంది ఇప్పటికే పెళ్లి అయినవాళ్లు, లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్నవాళ్లే ఉండటం గమనార్హం. ఇక గ్లీడెన్ డేటింగ్ యాప్ ద్వారా ప్రస్తుతం మెట్రో నగరాల్లో విస్తరిస్తున్న కల్చర్ పై స్పష్టత వస్తోంది. ఇక గ్లీడెన్ డేటింగ్ యాప్ లో యూజర్లలో 65 శాతం మంది పురుషులు ఉండగా 35 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే మహిళలు ఈ డేటింగ్ యాప్ లో జాయిన్ అవ్వడం క్రమంగా పెరుగుతోందని గ్లీడెన్ పేర్కొంది. గత రెండేళ్లలో మహిళా యూజర్ల సంఖ్య 148 శాతం పెరిగినట్లు స్పష్టం అవుతోందని తెలిపింది. అయితే ఈ యాప్ లో మహిళలకు ఫ్రీ యాక్సెస్ ఇవ్వడంతోనే ఆ సంఖ్య పెరుగుతుందని ఓ అభిప్రాయం.

ఇక గ్లీడెన్ డేటింగ్ యాప్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో అలాగే రాత్రి 10 నుంచి 12 గంటల మధ్యలో అధిక సంఖ్యలో యూజర్లు యాక్టివ్ ఉంటున్నారు. పురుషులు.. 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న మహిళలను కోరుకుంటున్నారు. అయితే మహిళలు మాత్రం 30 నుంచి 40 ఏళ్లు ఉండి.. ఆర్థికంగా ఉన్న డాక్టర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ నే ఎంచుకుంటున్నట్లు గ్లీడెన్ యాప్ స్పష్టం చేసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications