వ్యవసాయానికి పెద్ద పీట వేశాం: వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బొత్స
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ సిద్దమైంది. ఉదయం 8 గంటలకు ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించింది. అనంతరం బడ్జెట్ ప్రతిని పత్యేక ప్రతినిధి ద్వారా రాష్ట్ర గవర్నర్ వద్దకు పంపారు. మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాలకు శాసనసభలో ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సారి బడ్జెట్‌లో ఎన్నికల వేళ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా పెద్ద ఎత్తున సంక్షే మం..నవరత్నాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.

READ MORE


Click it and Unblock the Notifications