హామీని నిలబెట్టుకుంటాం: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: రైతులకు రోజుకు 9 గంటలు విద్యుత్తును అందిస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. తాము రైతులను మోసం చేయడానికి వాగ్దానం చేయలేదని, చేయగలమా లేదా అని ఆలోచించే తాము రైతులకు రోజుకు 9 గంటల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చామని ఆయన గురువారం శాసనసభలో చెప్పారు. హామీని నిలబెట్టుకోకపోతే తమను ప్రజలు క్షమించరనే విషయం కూడా తమకు తెలుసునని ఆయన అన్నారు.

విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలో అదనంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అనుకున్నామని, వర్షాలు పడి జల విద్యుత్ పెరుగుతుందని భావించామని, దాంతో ఆగస్టు నుంచి రైతులకు తొమ్మిది గంటలు విద్యుత్ అందించగలమని అనుకున్నామని, అయితే అలా జరగలేదని ఆయన అన్నారు. అయితే అంత మాత్రాన హామీని నిలెబట్టుకోమని ఏమీ లేదని, డిసెంబర్ నాటికైనా రైతులకు 9 గంటలు విద్యుత్ అందిస్తామని ఆయన అన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రైతులకు 9 గంటలకు విద్యుత్ అందిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సమాధానం ఇస్తున్న సమయంలో తెలుగుదేశం సభ్యులు పదే పదే అడ్డం పడే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+