"అన్నా క్యాంటీన్" లోనే సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు !!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తన 76వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం తన బర్త్ డే సెలబ్రేషన్స్ సామాన్య ప్రజలతో పాటు జరుపుకొని మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. దీంతో అందరివాడు మన చంద్రబాబు అంటూ అభిమానులు, పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన విజయవాడలోని పటమట ఏరియాలో ఉన్న "అన్నా క్యాంటీన్"కు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి వెళ్లి సాధారణ ప్రజల మధ్య అల్పాహారం చేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లోనే పుట్టినరోజు జరుపుకోవడం ద్వారా ప్రజలతో అనుబంధాన్ని మరింత బలపరిచారు. అయితే సీఎం రాక నేపధ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా చూసుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి రాకతో ఆ ప్రాంతంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

cm-chandrababu-naidu-and-nara-bhuvaneswari-visits-anna-canteen-at-vijayawada-on-the-occasion-of-his

కాగా సీఎం దంపతులు క్యాంటీన్‌లోకి చేరగానే అక్కడ ఉన్న లబ్ధిదారులు, కార్మికులు వారిని ఆత్మీయంగా స్వాగతించారు. ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా ప్రజలను పలకరిస్తూ, కొంతమందికి ఆహారం వడ్డించడం విశేషంగా నిలిచింది. సాధారణంగా చేసే విధంగానే టోకెన్లు తీసుకోవడానికి రూ.10 ఇవ్వగా.. నేడు ఉచిత భోజనం అందిస్తున్నామని నిర్వాహకులు తెలియజేయడం మరో ప్రత్యేకతగా నిలిచింది. అనంతరం లబ్ధిదారులతో కలిసి అల్పాహారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఒక రోజు నిర్వహణ ఖర్చుల కోసం రూ.76 లక్షలను అందించారు. ఈ విరాళంతో నేడు రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్లలో ప్రజలకు పూర్తిగా ఉచితంగా ఆహారం అందించబడుతోంది. సాధారణ రోజుల్లో రూ.5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించే ఈ క్యాంటీన్లు ఈరోజు మాత్రం పూర్తిగా ఉచిత సేవను అందిస్తున్నాయి.

ఇక అన్న క్యాంటీన్ పథకం పేదలు, కార్మికులు, దినసరి కూలీలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్న సంక్షేమ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. సీఎం జన్మదినం రోజున ఈ సేవలను మరింత విస్తరించడం ద్వారా వేలాది మంది లబ్ధిదారులకు ఆహార భద్రతను కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, సామాజిక వర్గాలు ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ, సీఎం దంపతుల సామాజిక స్పృహను ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+