రాయసీమలోని ఆ జిల్లాలో భారీ ఏరో స్పేస్ పరిశ్రమ.. సీఎం చంద్రబాబు శుభవార్త!

ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఏపీ సర్కార్ కీలకంగా పని చేస్తుంది. రాష్ట్రంలో అనేక కీలక ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకువచ్చిన చంద్రబాబు తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ వస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాయలసీమ వాసులకు మరో శుభవార్త చెప్పారు.

ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా వైపు ఏరోస్పేస్ రంగం దృష్టి

బెంగళూరులో విస్తరణకు అవకాశం లేకపోవడంతో, ఏరోస్పేస్ రంగం ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా వైపు చూస్తోందని ఆయన తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు జరిగితే ఇక్కడ ఉన్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉందన్నారు. భారీ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతంలో డ్రోన్, ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లు అభివృద్ధి చెందుతాయని, సమీప భవిష్యత్తులో లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు.

cm chandrababu said goodndews to rayalaseema district srisatyasai district with aerospace industry

గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక లోకేష్ కృషి

పరిశ్రమలకు అనుమతులు, ఇతర ప్రక్రియలను వేగంగా పూర్తిచేసి "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" అంటే ఏమిటో చూపించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ను సీఎం అభినందించారు. ఇదే సమయంలో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక జరిగిన కృషిని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చేలా లోకేశ్ అమెరికాలో గూగుల్ ప్రతినిధులను ఒప్పించారని పేర్కొన్నారు.

విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ కూడా ఆసక్తి

పన్నులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలతో కొన్ని సమస్యలున్నాయని గూగుల్ ప్రతినిధులు చెప్పగా, ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లకు వివరించి, అవసరమైన మార్పులు చేసేందుకు ఒప్పించి మార్గం సుగమం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ కూడా ఆసక్తి చూపుతోందని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి జరిగితే ఆర్ధికంగా రాష్ట్రం ముందుకు పోతుందని సీఎం చంద్రబాబు అన్నారు.

ఉద్యోగాల నియామకాల అర్హతలలో ఏఐ, ఐటీ పరిజ్ఞానం తప్పనిసరి

రాష్ట్రంలో పై స్థాయి ఉద్యోగాల నియామకాల అర్హతలలో ఏఐ, ఐటీ పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రులు కూడా ఏఐ, ఐటీలలో నాలెడ్జ్ పెంచుకోవాలని, లేదంటే వెనుక పడిపోతారని చంద్రబాబు అన్నారు. అన్ని విషయాలలోనూ మారుతున్న టెక్నాలజీతో పాటు అప్డేట్ అవ్వాలని చంద్రబాబు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+