విజయ్ గెలుపుతో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ!

తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన దళపతి విజయ్ పైన ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది. విజయ్ విజయంతో దక్షిణాది రాజకీయాల దిశ మారుతోందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు సోషల్ మీడియాలో మరో పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.. అదే జూనియర్ ఎన్టీఆర్.

విజయ్ పాలిటిక్స్.. దక్షిణాదిలో కొత్త ట్రెండ్?

దక్షిణాది స్టార్ హీరో విజయ్ తక్కువ సమయంలోనే ప్రజల్లో బలమైన మద్దతు సంపాదించడంతో,సినీ నటుల పొలిటికల్ ఎంట్రీపైన మళ్లీ ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ మొదలైంది.

Debate on junior ntr politics with the latest vijay party sensational victory in tamilnadu election results

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా?

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాజకీయ ఎంట్రీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చాలా కాలంగా ఆయన రాజకీయాలపై మౌనం వహించారు. ఆయన పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించారు.అయితే, ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్, కుటుంబ రాజకీయ నేపథ్యం కారణంగా, రాజకీయాల్లోకి వస్తే భారీ ప్రభావం చూపగలరని విశ్లేషకులు భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్

విజయ్ లాగే తారక్ కూడా పాలిటిక్స్‌లోకి వచ్చి తన తాత వారసత్వాన్ని నిలబెట్టాలని అభిమానులు కోరుతున్నారు. అయితే రాజకీయాలపై తన స్టాండ్ క్లియర్‌గా ఉందన్న తారక్.. ప్రస్తుతం సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. నాకు ఓట్లు అవసరం లేదు.. అభిమానులు నా సినిమా టిక్కెట్లు కొంటే చాలు అని గతంలోనే ఆయన స్పష్టం చేసినా ప్రజల నుండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ తరచూ వినిపిస్తుంది.

ఎన్టీఆర్ మనసులో ఏముందో

ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ప్రభంజనం ఖాయమని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు ఎంతగా డిమాండ్ చేసినా, సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎన్ని పోస్టులు పెట్టినా, ఎన్టీఆర్ మాత్రం ఇప్పట్లో రాజకీయాల వైపు చేసే ఆలోచనలో లేరు. మరి భవిష్యత్ లో అయినా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? లేక సినిమా రంగానికే పరిమితం అవుతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+