రఘురామకు బిగ్ షాక్..! అత్యవసర విచారణకు హైకోర్టు ఓకే..!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు (Raghurama Krishnam Raju) ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆకివీడు సమీపంలో రామాలయం పునర్ నిర్మాణం విషయంలో ఆయన ప్రదర్శిస్తున్న పట్టుదలకు హైకోర్టులో షాక్ తప్పలేదు. రామాలయం పునర్ నిర్మాణం కోసం గొంతెనమ్మ గుడిని అర్ధరాత్రి కూల్చేసిన వ్యవహారంలో స్థానికులు దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకరించింది.
ప్రభుత్వ స్థలాలలో ఎటువంటి మతపరమైన నిర్మాణాలు చేపట్టకూడదు అని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్న అనధికారికంగా రాజకీయ ప్రయోజనాలతో నూతనంగా గుడి నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆకివీడు పెద్దపేట కు చెందిన జయంతి ఉన్నమట్ట దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. ఆకివీడు పెద్దపేటలోని గొంతెనమ్మ గుడి, రచ్చబండ కూల్చివేతపై హైకోర్టులో అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జయసూర్యలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.

ఈ వ్యవహారంపై దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ అత్యవసరంగా ప్రధాన న్యాయమూర్తి ముందు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అభ్యర్ధించారు. గొంతెనమ్మ గుడి కట్టడాన్ని కూల్చి దాని స్థానంలో మరొక గుడి నిర్మాణం చేయాలని చూస్తున్నారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు నిబంధనలను అనుసరించి ప్రభుత్వ స్థలాలలో మతపరమైన నిర్మాణాలు చేయకూడదన్న ఉత్తర్వులను ఉదాహరించారు. రాజకీయ ప్రయోజనాలతో రాత్రికి రాత్రే గొంతెనమ్మ గుడి మరియు రచ్చబండ కోసం కేటాయించబడిన ప్రదేశాన్ని కూడా కూల్చివేశారని ఆరోపించారు. దీనిపై రేపు ఉదయం 10:30 కు విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది.












Click it and Unblock the Notifications