రఘురామ మరో సంచలనం.! క్రైస్తవులకు ఆహ్వానం..!

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్ నిర్మాణం విషయంలో నెలకున్న వివాదాల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam raju) కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న హఠాత్తుగా రామాలయ నిర్మాణానికి తొలి అడుగు వేశారు. అయితే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా రామాలయ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారికంగా శంఖుస్దాపన కార్యక్రమం నిర్వాహించాలని రఘురామ నిర్ణయించారు. ఈ మేరకు ఎక్స్ లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న క్రైస్తవులకు ఆహ్వానం కూడా పంపారు.

ప్రియమైన క్రిస్టియన్ సోదర సోదరీమణులకు, సాటి హిందూ మతస్థునిగా నా వివరణ అంటూ ఎక్స్ లో రఘురామ ట్వీట్ చేశాారు. ఆకివీడు రామాలయ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం దశమి ఘడియల్లో పనులు ప్రారంభించి, ఏకాదశి ఘడియల్లో పూర్తయ్యే విధంగా మా పండితులు సూచించిన ముహూర్తానికి అనుగుణంగా తెల్లవారు ఝామున 2 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఉదయం 11:25 నిమిషాలకు కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని ఆయన ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కొందరు "అర్ధరాత్రి రహస్యంగా నిర్వహించారు" అనే అపోహలు ప్రచారం చేస్తున్నట్లు గమనించామని, అయితే ఆ సమాచారంలో నిజం లేదని తెలిపారు. అన్ని కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు బహిరంగంగానే, ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించామన్నారు.

Raghurama Krishnam Raju Invites Christian Community to Ram Temple Foundation Event in Akiveedu

ఈ కార్యక్రమం పూర్తిగా చట్టబద్ధంగా, సంబంధిత అధికారుల అనుమతులతోనే నిర్వహించినట్లు రఘురామ తెలిపారు. రెవిన్యూ అధికారులు అన్ని పత్రాలను పరిశీలించి, అది రామాలయం అని నిర్ధారించిన తరువాత, మున్సిపల్ అనుమతులు తీసుకుని ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాము. ఈ విషయాన్ని అందరూ సానుకూలంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఆకివీడులో ఈ కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయ్యిందని, అయితే బయట ప్రాంతాల నుండి కొందరు వ్యక్తులు అపార్థాలకు దారితీసే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. దయచేసి అలాంటి విషయాలను పట్టించుకోకుండా, శాంతి, ఐక్యతను కాపాడేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా "చెరపకురా చెడేవు" అనే సామెతను గుర్తుచేశారు. మే 3 తేదీ ఉదయం 7:14 నిమిషాలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని మతాల వారు సెక్యులర్ భావంతో పాల్గొనవచ్చన్నారు. అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మత సామరస్యం మనందరి బాధ్యతని, రాజ్యాంగబద్ధంగా పరస్పర గౌరవంతో కలిసి జీవించడం మనందరికీ ముఖ్యమని మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు రఘురామ ట్వీట్ లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+