ఖాతాదారులకు బిగ్ అలర్ట్, వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్..!!
బ్యాంకు వినియోగదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు బంద్ కానున్నాయి. ఈ నెలలో వచ్చే వరుస సెలవులతో ఖాతాదారులు ముందస్తుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు ఆలోచన చేయాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఈ నెల 25,26వ తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ తేదీలతో వచ్చే మరో రెండు సెలవులతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.
ఎస్బీఐ ఖాతాదారులకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఈ నెల 25,26 తేదీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు సమ్మెకు నిర్ణయించాయి. అదే సమయంలో 24న ఆదివారం, 27న బక్రిద్ సెలవులు ఉండటంతో నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలు వినియోగదారులకు నిలిచి పోయే అవకాశం ఉంది. దేశంలో అగ్రగామి బ్యాంకు గా ఉన్న ఎస్బీఐ నాలుగు రోజుల సేవలు నిలిచిపోతే.. వినియోగదారులకు పెద్ద సంఖ్యలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ వరుస సెలవులతో లోన్లు, బ్యాంక్ డ్రాఫ్ట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ పనులకు అంతరాయం కలగనుంది. ఎస్బీఐ ఉద్యోగులు మొత్తం 16 డిమాండ్లను ముందుకు తెచ్చారు. సిబ్బంది కొరత వేధిస్తుండటంతో.. కొత్త నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు.

వినియోగ దారులకు బిగ్ అలర్ట్
ఇప్పటికే పలు విడతలుగా యాజమాన్యంతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు చర్చలు చేసాయి. అందు లో భాగంగా భద్రతా సిబ్బందిని పెంచడం, వేతనం వ్యత్యాసాలను తొలగించడం వంటి అంశాలపై సమ్మెకు నిర్ణయించారు. వైద్య ప్రయోజనాలు, పని పరిస్థితులను మెరుగుపర్చడం వంటి వాటిని ఉద్యోగుల సంఘం కోరుతోంది. ఇక పెన్షన్ నిబంధనల్లో మార్పులు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జాతీయ పెన్షన్ వ్యవస్థలో వెసులుబాటు, మెరుగైన బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
పెన్షన్ లెక్కింపు వ్యవస్థలో మార్పులు, మెరుగైన కెరీర్ గ్రోత్ వంటివి డిమాండ్ చేస్తున్నారు. మే 23వ తేదీ నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. ఇక మే 24వ తేదీ ఆదివారం సాధారణ సెలవు వచ్చింది. ఇక మే 25,26వ తేదీల్లో ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. 27న బక్రీద్ సెలవు ఉండే అవకాశం ఉంది. దీంతో మే 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉండటంతో.. ఇక నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు యథాతధంగా పనిచేయనున్నాయి.













Click it and Unblock the Notifications