స్టూపిడ్ మ్యారేజెస్: మూడు పెళ్లిళ్లపై నోరు విప్పిన స్టార్ హీరోయిన్!
మలయాళ నటి మీరా వాసుదేవన్ తన పర్సనల్ లైఫ్, మూడు పెళ్లిళ్ల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 44 ఏళ్ల మీరా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో 17 ఏళ్లను ముగ్గురు మూర్ఖులైన వ్యక్తులతో పెళ్లిళ్ల పేరుతో వృథా చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌లాల్ సరసన 'తన్మాత్ర' వంటి క్లాసిక్ హిట్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తన వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు తన కెరీర్‌ను కూడా దెబ్బతీశాయని వాపోయారు.
తమను సీరియస్‌గా తీసుకోని లేదా గౌరవించని వ్యక్తుల కోసం తన సమయాన్ని వృథా చేశానని మీరా వాసుదేవన్ పేర్కొన్నారు. "నేను తరచుగా నా కొడుకుతో చెబుతుంటాను.. నా జీవితంలోని 17 ఏళ్లను మూడు అర్థం లేని పెళ్లిళ్ల కోసం వెచ్చించాను. ఆ సమయంలో నేను తెలివిగా పని చేసి ఉంటే సినిమాల్లో గానీ, ఫిట్‌నెస్ రంగంలో గానీ ఎంతో సాధించి ఉండేదాన్ని. నా తల్లిదండ్రులు, సోదరితో గడపాల్సిన సమయాన్ని కూడా ఇతరుల కోసం వృధా చేశాను" అని ఆమె ధన్యా వర్మతో నిర్వహించిన సంభాషణలో భావోద్వేగానికి గురయ్యారు.

మీరా వాసుదేవన్ వైవాహిక జీవితం విషయానికి వస్తే.. ఆమె 2005లో విశాల్ అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. కానీ 2010లో వీరు విడిపోయారు. ఆ తర్వాత 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను పెళ్లాడగా.. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. 2016లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు. ఇక 2024 మే నెలలో సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియాంకమ్‌ను మూడో వివాహం చేసుకున్న మీర.., ఏడాది తిరగకముందే 2025 ఆగస్టులో ఆ బంధానికి కూడా స్వస్తి పలికారు.
గతంలో చేసిన తప్పుల గురించి తానేమీ దాచుకోవడం లేదని, ఆ చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టి ఇప్పుడు తన కెరీర్‌పై దృష్టి పెడుతున్నానని మీరా స్పష్టం చేశారు. ప్రస్తుతం తన జీవితంలో ఓ అందమైన దశలో ఉన్నానని, చాలా సంతోషంగా ఉన్నానని ఆమె వెల్లడించారు. 2003లో హిందీ చిత్రం 'రూల్స్: ప్యార్ కా సూపర్‌హిట్ ఫార్ములా'తో కెరీర్ ఆరంభించిన మీరా.. మలయాళంలో 'తన్మాత్ర', 'ఒరువన్', 'ఏకాంతం' వంటి చిత్రాలతో తన నటనకు గాను మంచి ప్రశంసలు అందుకున్నారు.












Click it and Unblock the Notifications