త్రిష చేతిపై ఉన్న టాటూకు.. విజయ్ కు సంబంధం ఏంటి..?
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీఎం అయిన నెక్స్ట్ డే నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఇక మే 13న జరిగిన బలపరీక్షలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విజయం సాధించింది. విజయ్ కు అనుకూలంగా 144 ఓట్లు, వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చాయి. దాంతో మరో ఐదేళ్ల పాటు విజయ్ తమిళనాడు రాష్ట్రాన్ని పాలించనున్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లకే సీఎం పదవి చేపట్టారు విజయ్. అప్పట్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి మహామహులకే ఈ అవకాశం దక్కింది. ఆ తర్వాత దాదాపు 50 ఏళ్ల తర్వాత విజయ్ వారి సరసన చేరారు.
ఇక విజయ్ ప్రమాణ స్వీకారంలో నీలిరంగు కంచి పట్టుచీర, జడలో మల్లెపూలతో తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా ఆమె కనువిందు చేశారు.స్టేజీ వద్ద అందరికీ అభివాదం చేస్తూ వేడుకకు హజరైన అతిథులను పలకరిస్తూ సందడి చేశారు. అలాగే వేదిక మీద నుంచి విజయ్ సైతం త్రిషను నవ్వుతూ పలు మార్లు చూశారు. అయితే త్రిష చేతిపై ఉన్న టాటూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె చేతిపై ఉన్న టాటూను చూసిన నెటిజన్లు.. ఇది విజయ్ తో సంబంధమా? అంటూ చర్చ మొదలుపెట్టారు.

అయితే సమాచారం ప్రకారం.. ఆ టాటూ వృషభ రాశిని సూచిస్తుందట. త్రిష తన రాశి అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మి ఈ టాటూను వేయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు విజయ్ ది కర్కాటక రాశి కావడంతో.. వృషభ- కర్కాటక రాశుల కలయిక చాలా బలమైనది అంటూ జ్యోతిష్య చర్చలు కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో త్రిష టాటూనే విజయ్ కు లక్ తీసుకొచ్చిందా? అంటూ అభిమానులు మీమ్స్, పోస్టులతో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నారు. ఇక త్రిష విజయ్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications