కేశినేని చిన్నికి కొలికపూడి బిగ్ షాక్..! జనసేన అభ్యర్ధిని గెలిపించి..!

ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో బహిరంగంగానే వైరం సాగిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni chinni), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivas) వివాదంలో ఇవాళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వీరిద్దరి వైరంలో భాగంగా ప్రత్యర్థులపై ఆధిపత్యం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా ఇద్దరూ వదులుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో తిరువూరులో జరిగిన ఓ ఎన్నిక ఎంపీ కేశినేని నాని వర్గానికి షాకిచ్చింది. దీని వెనుక, ముందు ఉన్నది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.

ఇవాళ జరిగిన తిరువూరు మెప్మా ఎన్నికల్లో కొలికపూడి కూట‌మి వ‌ర్గం విజయం సాధించింది. ఎంపీ కేశినేని వర్గానికి చెందిన అభ్యర్ధిపై కొలికవూడి వర్గం నిలబెట్టిన జనసేన అభ్యర్ధి డెక్కా నవ్య విజయం సాధించారు. ఆమెకు 23 మంది సభ్యులు ఓటేయడంతో గెలిచారు. ఈ మేరకు తాము ప్రజాస్వామ్యయుతంగా విజయం సాధించినట్లు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ప్రకటించారు. కొలికపూడి ఇచ్చిన షాక్ తో ఎంపీ వర్గం రగిలిపోతోంది.

TDP MLA Kolikapudi Srinivas Backs JanaSena To Oust MP kesineni Chinni in tiruvur mepma election

ఈ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉధ్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలూ తమ అభ్యర్ధుల్ని గెలిపించుకునందుకు తీవ్రంగా ప్రయత్నించినా స్ధానిక ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాస్ తాను మద్దతిచ్చిన నవ్యను గెలిపించుకోగలిగారు. ఇప్పటికే తిరువూరు కేంద్రంగా సాగుతున్న కొలికపూడి వర్సెస్ కేశినేని చిన్ని వర్గాల వార్ లో ఇప్పుడు ఎమ్మెల్యే పైచేయి సాధించడంతో రాబోయే రోజుల్లో ఈ రాజకీయాలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+