టీడీపీ ఎంపీకి కేంద్రం పదవి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పెట్టుబడులపై దృష్టి పెట్టింది. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కు ఇటీవలే శంకుస్థాపన చేసిన జోష్ లో ఉన్న ప్రభుత్వం అదే దూకుడును కొనసాగిస్తోంది. రాష్ట్రంలో ఇతర నగరాల్లో భారీ పెట్టుబడులను సాధించే దిశగా చర్యలు తీసుకుంటోంది.

ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలో తెలుగుదేశం పార్టీకి కీలక హోదా లభించింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా ఈ కమిటీని నియమించారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీ ఇది. పార్లమెంట్ లో పనిచేసే మూడు కీలకమైన ఆర్థిక స్థాయీ సంఘాలలో ఇదీ ఒకటి. ఆయా సంస్థల నివేదికలు, ఆర్థిక ఖాతాలను సమగ్రంగా పరిశీలించడం, ప్రజా పద్దుల కమిటీ , అంచనాల కమిటీతో కలిపి పని చేయడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం.

TDP MP Vemireddy Prabhakar Reddy Added as Member in Committee on Public Undertakings by Om Birla

ఈ కమిటీని పునర్వ్యవస్థీకరించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. 22 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని ప్రకటించారు. లోక్ సభ నుంచి 15, రాజ్యసభ నుంచి ఏడుమందిని తీసుకున్నారు. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ బైజయంత్ జై పండా ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సభ్యత్వం లభించింది. లోక్ సభ నుంచి ఎంపికైన 15 మంది సభ్యుల్లో ఆయనా ఒకరు.

లోక్ సభ నుంచి..

వేమిరెరడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు తారిక్ అన్వర్, చంద్ర ప్రకాష్ జోషి, కనిమొళి, కౌశలేంద్ర కుమార్, శంకర్ లాల్వానీ, పూనంబెన్ హేమత్భాయ్ మాడమ్, బీవై రాఘవేంద్ర, రాజీవ్ రాయ్, ముఖేష్ రాజ్‌పుత్, సుఖ్‌జిందర్ సింగ్ రంధావా, ప్రొఫెసర్ సౌగత రే, ప్రతాప్ చంద్ర సారంగి, కొడికున్నిల్ సురేష్ ఉన్నారు.

రాజ్యసభ నుంచి..

డాక్టర్ జాన్ బ్రిట్టాస్, మిళింద్ మురళీ డియోరా, సయ్యద్ నాజర్ హుస్సేన్, సంజయ్ కుమార్ ఝా, సురేంద్ర సింగ్ నగర్, దేబాశీష్ సామంతరే, అరుణ్ సింగ్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+