తెలంగాణా రాష్ట్రంలో మగవారిలో ఆ సమస్య.. షాకింగ్ రిపోర్ట్!

తెలంగాణలో మగవారి ఆరోగ్యానికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ 'త్రాయ హెల్త్' నిర్వహించిన 'జాతీయ గట్-హెయిర్ హెల్త్ సర్వే'లో పురుషుల ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనకర వాస్తవాలు బయటపడ్డాయి. మగవారిలో జుట్టు ఊడిపోవటం, జీర్ణ సంబంధిత ఆరోగ్యం పైన అధ్యయనం చేసిన సంస్థ షాకింగ్ విషయాలను వెల్లడించింది .

మలబద్ధకం స్థాయి ప్రధాన సూచికగా గట్ హెల్త్‌ అంచనా

దేశవ్యాప్తంగా 1.6 లక్షల మంది పురుషులపై 2024 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ మధ్య కాలంలో ఈ అధ్యయనం జరిగింది. మలబద్ధకం స్థాయిని ప్రధాన సూచికగా తీసుకొని గట్ హెల్త్‌ను అంచనా వేశారు. 2024లో ఆరోగ్యకర జీర్ణక్రియ (తక్కువ లేదా మలబద్ధకం లేని వారు) ఉన్నవారి శాతం 19.13%గా ఉంది. 2025లో 15.03%గా ఉన్న ఈ గట్ హెల్త్, ఏడాదిలోనే 4.10 శాతం తగ్గుదల నమోదైంది.

Telangana men facing rapid decline in gut health leading to surge in hair fall cases highest in India

గట్ హెల్త్ సమస్యలో తెలంగాణది మొదటి స్థానం

తెలంగాణలో మగవారిలో జీర్ణ సంబంధిత ఆరోగ్యం గట్ హెల్త్ వేగంగా తగ్గుతోందని, దీని ప్రభావంతో జుట్టు రాలడం (హెయిర్ ఫాల్) సమస్య దేశంలోనే ఇక్కడే ఎక్కువగా నమోదవుతోందని తాజా సర్వే వెల్లడించింది. మలబద్ధకం స్థాయిని ప్రధాన సూచికగా తీసుకొని చేసిన సర్వేలో దేశంలోని 10 ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాజస్థాన్ (-3.3%), ఢిల్లీ (-2.97%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

గట్ హెల్త్ సమస్యతో హెయిర్ ఫాల్

జీర్ణ సమస్యలు పెరగడం వల్ల శరీరం పోషకాలను సరిగా గ్రహించలేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు ఏర్పడి జుట్టు రాలడం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, ఒత్తిడి, అనియమిత భోజనాలు, నిద్రలేమి వంటి ఆధునిక జీవన విధానాలు ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా చెప్పుతున్నారు.

త్వరలో సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్ చేసిన వైద్యారోగ్య శాఖా మంత్రి
త్వరలో సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్ చేసిన వైద్యారోగ్య శాఖా మంత్రి

నిపుణుల సూచనలు

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కూరగాయలు, పండ్లు, ధాన్యాలు తీసుకోవటం, నీళ్లు సరిపడాతాగటం, రెగ్యులర్ వ్యాయామం, సమయానికి నిద్ర అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు .ఒత్తిడిని నియంత్రించాలని చెప్పారు. తెలంగాణ యువతలో ఈ సమస్యలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య స్పృహ పెంపొందించాలని వైద్యులు సూచిస్తున్నారు. గట్ హెల్త్ మెరుగుపరచడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యను కూడా ఎక్కువగా అదుపు చేయవచ్చని ఈ సర్వే సూచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+