ఏపీలో పది ఫలితాల ముహూర్తం ఖరారు, ఈ సారి ప్రత్యేకంగా - ఇలా చెక్ చేసుకోండి..!!
పది పరీక్షలు రాసిన విద్యార్ధులకు బిగ్ అలర్ట్. ఫలితాల విడుదల పైన SSC బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూల్యాకనం పూర్తి కావటంతో ఫలితాల విడుదలకు తుది కసరత్తు చేస్తోంది. ఈ సారి ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని బోర్డు భావిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వానికి తమ సంసిద్దత తెలియ చేసింది. అన్నీ అనుకూలిస్తే రేపు (శనివారం) ఫలితాలను విడుదల చేయాలని ఏపీ SSC బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ సాయంత్రానికి ఫలితాల ప్రకటన పైన తుది నిర్ణయం తీసుకోనుంది.
ఏపీలో పది పరీక్ష ఫలితాల వెల్లడి కోసం తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 25వ తేదీన పది ఫలితాలను ప్రకటించేందుకు బోర్డు సమాయత్తం అవుతునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బోర్డు మాత్రం అధికారికంగా ఫలితాల సమాచారం తామే వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మే తొలి వారంలో ఈ ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. ఎస్ఎస్‌సీ బోర్డు తమ అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.inలో వీటిని విడుదల చేయనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత మార్కుల మెమోను results.bse.ap.gov.in లేదా bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఫలితాల తనిఖీ సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హాల్ టికెట్ నంబర్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. 2025 ఏపీ ఎస్‌ఎస్‌సీ ఫలితాలు ఏప్రిల్ 23, 2025న విడుదలయ్యాయి.

మార్కులు తెలుసుకోవాలంటే
దీంతో ఈ ఏడాది కూడా దాదాపు ఇదే వారంలో ఫలితాలు రిలీజ్ చేయాలని తొలుత భావించారు, అయితే, ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు పూర్తి చేసిన మే తొలి వారంలో విడుదల దిశగా తుది కసరత్తు కొనసాగుతోంది. కాగా, పదో తరగతి పరీక్షలను మార్చి 16 నుంచి 1 ఏప్రిల్ 2026 వరకు అధికారులు నిర్వహించారు. ఫలితాల కోసం విద్యార్ధులు అధికారిక సైట్లు bse.ap.gov.in లేదా results.bse.ap.gov.inని సందర్శించాల్సి ఉంటుంది. అందులో ల్యాండింగ్ పేజీలో AP SSC Results 2026 అనే లింక్‌పై క్లిక్ చేయండి. అక్కడ హాల్ టికెట్ నంబర్ లేదా రోల్ నంబర్‌ను నమోదు చేయాలి.. ఆ తరువాత సమర్పించు(సబ్మిట్) బటన్‌పై క్లిక్ చేయటంతో నే BSEAP 10, 12వ తరగతి ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. పదో తరగతిపై క్లిక్ చేసి ఫలితాలు చూసుకునే వెసులుబాటు కల్పించారు. అదే విధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మన మిత్ర యాప్ ద్వారాను ఫలితాలను తెలుసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications