IPL 2026 కెప్టెన్లలో తోపు అతనే- ఎవరి ర్యాంకు ఎంతంటే..!!

IPL 2026 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ కోసం జట్ల మధ్య పోటీ నడుస్తోంది. లీగ్ తుది దశ మ్యాచుల్లో అంచనాలు తార మారు అవుతున్నాయి. ప్లే ఆఫ్స్ కు చేరే నాలుగు జట్ల పైనా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పాయింట్స్ టేబుల్ లో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఖాయంగా ప్లే ఆఫ్స్ కు వెళ్తాయా అంటే.. ఇంకా డౌట్ గానే ఉంది. ఇదే సమయంలో ఐపీఎల్ 2026 లో బెస్ట్ కెప్టెన్ ఎవరనే అంశం పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు ఈ సీజన్ బెస్ట్ కెప్టెన్ ఎవరో తన అభిప్రాయం స్పష్టం చేసారు.

ఐపీఎల్ 2026 లో ప్లే ఆఫ్స్ కు చేరేందుకు జట్లు చివరి పోరాటం చేస్తున్నాయి. పాయింట్ల పట్టిక లో కొన్ని టీంలు ఎలాంటి అంచనాలు లేకుండానే తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇక, ఈ సారి సీజన్ లో బెస్ట్ కెప్టెన్ ఎవరనేది అంబటి రాయుడు విశ్లేషించారు. కొన్ని జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ప్రస్తుత పట్టికలో ఆర్సీబీ, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కాగా.. ముంబాయి.. గుజరాత్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగాయి. అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక ప్రముఖ స్పోర్స్ ఛానల్ తో మాట్లాడిన అంబటి రాయుడు తన అభిప్రాయం మేరకు ఐపీఎల్ 2026 లో అత్యుత్తమ కెప్టెన్ గా శుభమన్ గిల్ పేరు చెప్పారు. గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శన చేస్తుందని ప్రశంసించారు. అదే విధంగా ఈ సీజన్ లో కెప్టెన్లకు తన ర్యాంకింగ్స్ ఇచ్చారు.

PBKS ఓటమితో ప్లే ఆఫ్స్ రేసులో బిగ్ ట్విస్ట్ - ఇక, ఈ టీంలకే ఛాన్స్..!!
PBKS ఓటమితో ప్లే ఆఫ్స్ రేసులో బిగ్ ట్విస్ట్ - ఇక, ఈ టీంలకే ఛాన్స్..!!
ambati-rayudu-has-named-shubman-gill-as-the-best-captain-of-ipl-2026-so-far-explains-the-qualities

గుజరాత్ టైటాన్స్ కు ఎక్కువ అవకాశాలు

అంబటి రాయుడు ఇచ్చిన ర్యాగింగ్స్ మేరకు తొలి ర్యాంకు శుభమన్ గిల్ తొలి స్థానంలో ఉండగా.. ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటేదర్ రెండో స్థానంలో.. సన్ రైజర్స్ కెప్టెన్ కమ్మిన్స్ మూడో స్థానంలో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు నాలుగో స్థానం ఇచ్చిన రాయుడు.. లక్నో కెప్టెన్ పంత్ ఈ సీజన్ నిరాశపర్చిన కెప్టెన్ గా అభిప్రాయ పడ్డారు. గుజరాత్ ఈ టోర్నీలో అన్ని విభాగాల్లోనూ సమతూక ప్రదర్శన చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఈ జట్టు నిలకడగా రాణిస్తుంది. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన గుజరాత్ వాటిల్లో 8 గెలిచి.. 16 పాయింట్లతో టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. కెప్టెన్ శుభమన్ గిల్ వ్యక్తిగతంగా అద్భుత ఫాంలో ఉండటం జట్టుకు కలిసి వస్తోంది. గిల్ దూకుడుతో ప్లే ఆఫ్స్ దాదాపు ఖాయం చేసుకున్న గుజరాత్ ఈ సారి టైటిల్ ఫేవరెట్ టీంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+