ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. అంతలోనే ఊహించని ట్విస్ట్!

వివాహేతర సంబంధం కారణంగా భర్తను చంపాలని భార్య, ఆమె ప్రియుడు చేసిన ప్లాన్ ఊహించని మలుపు తిరిగింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తను హతమార్చాలని చేసిన కుట్ర ఊహించని రీతిలో బయటకు వచ్చింది . ఏపీలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలలోకి వెళితే ..

భర్తను చంపాలని ప్లాన్ చేసిన భార్య

సత్తెనపల్లిలో నాగరాజు అనే వ్యక్తి పునుగుల బండి నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం దొనకొండకు చెందిన భవానితో వివాహం జరిగి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కొద్ది నెలల క్రితం భవానికి మహేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలిసిన నాగరాజు భార్యతో గొడవలు పడుతున్నాడు. భవాని తన ప్రియుడు మహేష్‌ను పిలిచి భర్తను చంపాలని ప్లాన్ చేసింది.

Murder attempt A woman and her lover plan to murder her husband over an illegal affair in sattenapalli

నలుగురితో హత్యకు ప్లాన్

మూడు నెలల క్రితం గొడవలు తీవ్రరూపం దాల్చడంతో నాగరాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చిన నాగరాజుతో మళ్లీ గొడవ పడిన భవాని, మహేష్‌కు ఫోన్ చేసి పిలిచింది. మహేష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి రెండు బైకులపై మద్యం మత్తులో రాత్రి సమయంలో నాగరాజు ఇంటికి చేరుకున్నాడు. బీర్ బాటిళ్లను రోడ్డుపై పగులగొట్టి, గండ్ర గొడ్డలితో నిన్ను చంపేస్తాం అంటూ హడావుడి చేశారు.

ఆయుధాలతో వచ్చిన వారిని పట్టుకున్న స్థానికులు

రాత్రి సమయంలో ఆయుధాలతో వ్యక్తులు రావటంతో అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తమయ్యారు. వారు రంగంలోకి దిగి నలుగురిని అడ్డుకున్నారు. ప్రధాన నిందితుడు మహేష్ మరొకరితో కలిసి పరారీ అయ్యాడు. మిగిలిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితులను విచారించగా, భవాని చెప్పినట్టు భర్తను చంపడానికే వచ్చామని ఒప్పుకున్నారు.

తెలంగాణా రాష్ట్రంలో మగవారిలో ఆ సమస్య.. షాకింగ్ రిపోర్ట్!
తెలంగాణా రాష్ట్రంలో మగవారిలో ఆ సమస్య.. షాకింగ్ రిపోర్ట్!

నలుగురిపై కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై భవాని, మహేష్‌తో సహా నలుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కుటుంబ వ్యవస్థలో వివాహేతర సంబంధాలు ఎంతటి ప్రమాదకరమో మరోసారి ఈ ఘటన కారణంగా రుజువైంది.భర్తను చంపాలని ప్లాన్ చేసిన భార్య కటకటాల పాలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+