TVK విజయ్ ప్రభంజనం వెనుక కారణం అదే..! తేల్చేసిన విజయసాయిరెడ్డి..!
తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో (tamil nadu assembly election ఇవాళ అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రధాన కూటములైన అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేలను తిరస్కరించిన తమిళ ఓటర్లు.. విజయ్ కొత్త పార్టీ టీవీకేకు భారీ ఆధిక్యం కట్టబెట్టారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన) జిక్ మార్క్ 118 సీట్లు అందించకపోయినా రెండేళ్ల క్రితం పుట్టిన కొత్త పార్టీకి ఈ స్ధాయిలో సీట్లు ఇవ్వడం ద్వారా తమిళ ఓటర్లు, ముఖ్యంగా యువత తమ అభిప్రాయాన్ని క్లియర్ గా చెప్పేశారు.
ఈ నేపథ్యంలో ఏపీలోనూ టీవీకే సాధించిన ఘన విజయంపై చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) విజయ్ ఘన విజయంపై స్పందించారు. ఓవైపు విజయ్ సాధించిన గెలుపును ప్రశంసిస్తూనే.. మరోవైపు అందుకు గల కారణాల్ని కూడా వెల్లడించారు. అలాగే వారసత్వ రాజకీయాల్ని నమ్ముకున్న పార్టీలకు సైతం విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. వాటికి కాలం చెల్లిందంటూ పరోక్షంగా తన ట్వీట్ ద్వారా తేల్చేశారు.

With Vijay’s TVK making a historic debut in Tamil Nadu polls, it reinforces a clear trend: South India continues to create space for credible, non-partisan regional voices rooted in state interests. Legacy parties carry baggage; new entrants bring energy, focus, and a renewed…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2026
తమిళనాడు ఎన్నికలలో విజయ్ టీవీకే చారిత్రాత్మక అరంగేట్రం చేయడంతో, ఒక స్పష్టమైన ధోరణి బలపడుతోందని విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలలో పాతుకుపోయిన విశ్వసనీయమైన, నిష్పక్షపాత ప్రాంతీయ గొంతుకలకు దక్షిణ భారతదేశం నిరంతరం చోటు కల్పిస్తోందని గుర్తుచేశారు. పాత పార్టీలు భారంతో బరిలోకి దిగుతాయని, కొత్తగా ప్రవేశించేవారు శక్తిని, ఏకాగ్రతను, పరిపాలన పట్ల నూతన నిబద్ధతను తీసుకువస్తారని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ట్వీట్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు కూడా మద్దతుగా ఉన్నట్లు కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications