బెంగాల్, తమిళనాడు చూశారుగా..! వైసీపీ నేతలకు సజ్జల బిగ్ అలర్ట్..!
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (SIR) కారణంగా అక్కడ అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం తాజా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. చాలా నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపుల వల్ల తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోగా.. బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ పై ఇప్పటికే పార్టీ నాయకుల్ని అప్రమత్తం చేస్తున్న వైఎస్సార్సీపీ (YSRCP)
రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మరోసారి హెచ్చరికలు చేశారు.
పార్టీ నేతలతో నిర్వహించిన జూమ్ కాల్ లో.. ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సవరణ)పై మరింత అప్రమత్తంగా ఉండాలని సజ్జల సూచించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలన్నారు.అందుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ ను పెంచుకోవాలన్నారు.ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా (బెంగాల్, తమిళనాడు)లో తొలగించారని, కాబట్టి పార్టీ నేతలు తమ ఓటర్లు, సానుభూతిపరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

బీఎల్ఓలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, కాబట్టి వైసీపీ తరపున ఉండే బీఎల్ఏలు కూడా సమర్ధుడై, బీఎల్వోతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎస్ఐఆర్‌ను అవకాశంగా తీసుకుని మన ఓటర్లను కాపాడుకోవాలన్నారు.బీఎల్ఓలు ఇప్పటికే మ్యాపింగ్ చేశారు కాబట్టి.. పార్టీ ఏర్పాటుచేసుకున్న బీఎల్ఏలు కూడా అందుకు సన్నద్దంగా ఉండాలన్నారు.ఎస్ఐఆర్ మొదలయ్యోలోగా మనం అందుకు అవసరమైన విధంగా సిద్దంగా ఉండాలని,బీఎల్ఏలు సాంకేతికపరంగా ఎక్స్‌పర్ట్ అయి ఉండి అందరితో సమన్వయం చేసుకోవాలని కోరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ సిద్దంగా ఉంటుందని,బీఎల్ఏలకు అవసరమైన ఓరియెంటేషన్ కూడా ఇస్తామని సజ్జల తెలిపారు. నిరంతరం దీనిపై దృష్టిపెడితే సార్వత్రిక ఎన్నికలను సులువుగా గెలవచ్చన్నవారు. అంతే కాక స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలవచ్చని తెలిపారు.














Click it and Unblock the Notifications