మళ్లీ పెరిగింది: షాక్ ఇస్తున్న బంగారం

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పసిడి మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గత వారం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు, ఇప్పుడు మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి.

మే 7, గురువారం నాటి తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.33 పెరిగి రూ.15,246 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.30 పెరిగి రూ.13,975 కి చేరుకుంది. 18 క్యారెట్ల ధర రూ.20 మేర పెరిగి రూ.11,434 వద్ద స్థిరపడింది. ఇక భారీ స్థాయిలో కొనుగోలు చేసే వారి కోసం చూస్తే, 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3,300 పెరిగి రూ.15,24,600 కు చేరుకోవడం మార్కెట్ తీవ్రతను తెలియజేస్తోంది.

Gold Prices Hike Again in Hyderabad 24K Gold Reaches Rs1 52 Lakh Silver Remains Steady at Rs2 75 Lakh
షాక్ ఇస్తున్న బంగారం ధరలు: వరుసగా రెండో రోజు భారీ పెరుగుదల!
షాక్ ఇస్తున్న బంగారం ధరలు: వరుసగా రెండో రోజు భారీ పెరుగుదల!

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు ఒకే రీతిలో ఉన్నాయి. ఈ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.330 పెరిగి రూ.1,52,460 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,750 గా నమోదైంది. బెంగళూరు, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇదే స్థాయి ధరలు కొనసాగుతుండగా, దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,52,390 వద్ద ట్రేడ్ అవుతోంది. అహ్మదాబాద్‌లో రూ.1,52,510 గా ఉంది.

Gold: గ్రహణం పట్టిందా?.. లక్షన్నర మార్కుకు చేరిన బంగారం!
Gold: గ్రహణం పట్టిందా?.. లక్షన్నర మార్కుకు చేరిన బంగారం!

దక్షిణాదిలో చెన్నై మార్కెట్ ఎప్పుడూ అత్యధిక ధరను నమోదు చేస్తూనే ఉంది. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,830 వద్ద పలుకుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 కి చేరుకుంది. యుద్ధ వాతావరణం చల్లారకపోతే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+