ఏసీతో జర జాగ్రత్త- అది పేలి 9 మంది మృతి
ఢిల్లీలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. షాదారా వివేక్ విహార్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగారు. పలువురు గాయపడ్డారు. ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. మంటల్లో చిక్కుకున్న 10 మందిని రక్షించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వివేక్ విహార్ ఫేజ్-1లో ఈ తెల్లవారు జామున 3:35 నిమిషాల సమయంలో నాలుగంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీ పేలడం వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు శరవేగంగా వ్యాప్తి చెందాయి. రెండు, మూడు, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. మంటలు చెలరేగినప్పుడు భవనంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 10 నుండి 15 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వారిలో పలువురికి గాయాలయ్యాయి.

వారిని గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మంటల బారిన పడ్డ రెండవ అంతస్తు నుండి మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మరణించిన వారి వివరాలు ఇంకా రాలేదు. దీనికి డీఎన్ఏ పరీక్ష అవసరమని పోలీసులు పేర్కొన్నారు.
మృతదేహాలు కాలిపోవడం వల్ల ఇప్పటికిప్పుడు గుర్తింపు సాధ్యం కావట్లేదని వివేక్ విహార్ మున్సిపల్ కౌన్సిలర్ పంకజ్ లూథ్రా చెప్పారు. కంట్రోల్ రూమ్ కు కాల్ వచ్చిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయని షాదారా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ మీనా తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, 15 మందిని దుర్ఘటన స్థలం నుంచి కాపాడినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications