విజయ్ మరో సంచలనం, నేరుగా స్టాలిన్ తో భేటీ - కీలక మలుపు..!!
తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసారు. అసెంబ్లీలో బల నిరూపణకు సిద్దం అవుతున్నారు. అయిదు పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్.. అసెంబ్లీలో తన సంఖ్యా బలం నిరూపించుకోనున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా విజయ్ నేరుగా మాజీ సీఎం స్టాలిన్ తో సమావేశం కానుండటం ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పుడు వీరిద్దరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెంచుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13న అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కోనున్నారు. 234 సభ్యులు ఉన్న అసెంబ్లీలో 118 మేజిక్ ఫిగర్. కాగా.. ఇప్పటికే అయిదు పార్టీల మద్దతుతో విజయ్ బలం 120 కి చేరింది. కాగా.. ఈ బల నిరూపణ అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అటు అన్నా డీఎంకేలో చీలక వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అటు స్టాలిన్ కు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలే ఇప్పుడు విజయ్ ప్రభుత్వంలో కీలకంగా మారాయి. ఆ పార్టీల మద్దతు పైనే విజయ్ ప్రభుత్వం కొనసాగుతోంది. విజయ్ కు మద్దతు ఇవ్వటంతో కాంగ్రెస్ కు డీఎంకే గుడ్ బై చెప్పింది. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ సైతం హాజరయ్యారు. అటు డీఎంకే ను కాంగ్రెస్ వెన్ను పోటు పొడిచిందని ప్రధాని ఆరోపించారు. ఈ సమయంలోనే సీఎం విజయ్ నేరుగా మాజీ సీఎం స్టాలిన్ ను కలవాలని నిర్ణయించారు. ఈ మధ్యాహ్నం స్టాలిన్ నివాసానికి వెళ్లనున్నారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వం కోల్పోవటంతో పాటుగా.. తన నియోజకవర్గం లో టీవీకే అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. తన మిత్రపక్షాలకు విజయ్ కు మద్దతు ఇచ్చే విధంగా స్వేఛ్చగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించారు. ఈ సమయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నేరుగా స్టాలిన్ తో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే హామీల అమలు.. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పన విజయ్ - స్టాలిన్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అయితే.. స్టాలిన్ తో విజయ్ భేటీ మర్యాద పూర్వకమేనని టీవీకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్టాలిన్ తో పాటుగా డీఎంకే, ఎండీఎంకే నేతలతోనూ విజయ్ భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత వీరిని మర్యాద పూర్వకంగా కలుస్తున్నారని.. ఇందులో రాజకీయం లేదని చెబుతున్నారు. అయితే, స్టాలిన్ తో కలిసి ప్రయాణం చేసిన పార్టీలే ఇప్పుడు తన ప్రభుత్వ మనుగడలో కీలకంగా మారటం తో.. విజయ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications