నిన్న చరణ్.. నేడు ఎన్టీఆర్... రికార్డులు బ్రేక్ చేసేది ఎవరో ???
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా, రామ్ చరణ్ మేకోవర్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. అందులో పెద్ది పాత్రను విభిన్న కోణాల్లో పరిచయం చేశారు. క్రికెట్, కుస్తీ వంటి ఏ క్రీడలోనైనా పెద్ది ఆల్ రౌండర్ అని, ఆయనే ముందుంటారని చూపించారు. తన ప్రాంతం, మట్టి కోసం పెద్ది పోరాడుతాడని, ఇందులో అథ్లెట్స్ కీలక పాత్ర పోషిస్తారని కూడా ట్రైలర్ వెల్లడించింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, అంతకుమించిన భావోద్వేగాలు, పాత్రల మధ్య సంఘర్షణ కూడా ఉన్నాయని ట్రైలర్ సూచిస్తుంది.

మరీ ముఖ్యంగా అటవీ ప్రాంతంలో మనుగడ కోసం సాగే పోరాటం, "ఆటే నా పొగరు" అనే రామ్ చరణ్ డైలాగ్ అతని పాత్ర తత్వాన్ని స్పష్టంగా వెల్లడిస్తాయి. జాన్వీ కపూర్ పట్టుదలతో కూడిన 'రౌడీ బేబీ' తరహా పాత్రలో అలరించనుండగా, ఊరి పెద్దగా శివరాజ్ కుమార్ "ఆట గెలవడం ముఖ్యం కాదు, బతకడం కావాలి" అనే డైలాగ్‌తో ఆకట్టుకుంటారు. చివరగా "నేను ఆడానని అనుకుంటున్నారు, కానీ నేను పోరాడాను సార్" అనే రామ్ చరణ్ డైలాగ్‌లు కథాంశం వెనుక లోతైన రహస్యం ఉందని సూచిస్తున్నాయి. చరణ్ ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడం, రాజకీయ నాయకులు గ్రామంలోకి ప్రవేశించడం వంటి అంశాలు ట్రైలర్‌లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇవి కేవలం ఆట, పోరాటం కాకుండా, రాజకీయ కోణాలను కూడా పట్టి చూపుతున్నాయి.
అయితే 'పెద్ది' ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అనేక అంశాలను ఒకేసారి చూపించడంతో సినిమా ప్రధాన కథాంశం, చరణ్ పోరాటం దేనికోసం అనే స్పష్టత కొరవడిందనే విమర్శలున్నాయి. నిడివి ఎక్కువగా ఉన్నా, ఇది ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తిని పెద్దగా రేకెత్తించలేదని కొందరు పేర్కొన్నారు. ఈ సమయంలోనే మరోవైపు ఈ మూవీకి ఎన్టీఆర్ - నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి పోటీ పెడుతున్నారు నెటిజన్లు.
Today 11:52 PM. The storm awakens. 🧨 https://t.co/FT6Hcf3WVX
— #NTRNeel (@NTRNeelFilm) May 18, 2026
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. అలానే ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. జూన్ 25, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 19 రాత్రి 11:52 గంటలకు (IST) కొన్ని థియేటర్లలో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
CBFC సర్టిఫికేషన్ ప్రకారం, ఈ వీడియో 4 నిమిషాల 35 సెకన్లు ఉంది. సాధారణంగా గ్లింప్స్‌లు నిమిషం లోపు, ట్రెయిలర్‌లు మూడు నిమిషాలు మించవు. ఈ అనూహ్య నిడివి అభిమానుల్లో తీవ్ర ఉత్సుకత రేకెత్తించింది. సంప్రదాయ టీజర్ కాకుండా, ప్రశాంత్ నీల్ ప్రపంచానికి పూర్తి సినీ పరిచయాన్ని ఆశిస్తున్నారు. సర్టిఫికేషన్‌లో "గ్లింప్స్ ఆఫ్ డ్రాగన్" అని ఉండటంతో, "డ్రాగన్" అధికారిక టైటిల్ అయ్యే అవకాశం ఉందని బలమైన సూచనలున్నాయి.












Click it and Unblock the Notifications