Congress-TVK Alliance: కాంగ్రెస్-విజయ్ బంధం ఈనాటిది కాదా ? వైరల్ ఫొటో..!

తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి దూరంగా ఉన్నామని విజయ్ పార్టీ టీవీకేకు అర్దమైంది. దీంతో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి తన కుమారుడికి మద్దతివ్వాలని కోరారు. టీవీకేకు మద్దతిస్తే అధికారం రుచిచూపిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే విజయ్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడం, వెంటనే కాంగ్రెస్ కూడా అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఇలా కాంగ్రెస్-టీవీకే పొత్తు (Congress-TVK Alliance)కుదరడం సహజంగానే బీజేపీ సహా చాలా మందికి రుచించడం లేదు. వాటి ఫలితమే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం ఆలస్యం.

Vijay: విజయ్ కు మళ్లీ గవర్నర్ షాక్..! రెండోసారీ నిరాశే..!
Vijay: విజయ్ కు మళ్లీ గవర్నర్ షాక్..! రెండోసారీ నిరాశే..!

సీన్ కట్ చేస్తే .. విజయ్ కూ, కాంగ్రెస్ కూ మధ్య ఇంత త్వరగా పొత్తు ఎలా కుదిరిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీనికి సమాధానం విజయ్ మాజీ ఫ్రెండ్, గతంలో కాంగ్రెస్ యువజన విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రాగిణీ నాయక్ వెల్లడించారు. విజయ్ తో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బంధం ఈనాటిది కాదని ఆమె చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.

Congress-TVK Alliance Not Sudden Says Ragini Nayak Shares 12-Year-Old Photo With Vijay as Proof
విజయ్ కోసం సొంత పార్టీపై కస్తూరి తిరుగుబాటు..! కుట్ర, నీచమైన ఆట..!
విజయ్ కోసం సొంత పార్టీపై కస్తూరి తిరుగుబాటు..! కుట్ర, నీచమైన ఆట..!

రాగిణీ నాయక్.. విజయ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ లో..నీకు నాకు మధ్య ముందు నుంచే ఒక బంధం ఉంది, టీవీకే-కాంగ్రెస్ మధ్య మధ్య పొత్తు ఇంత అకస్మాత్తుగా ఎలా కుదిరిందని విలపిస్తున్న సంఘీ/బీజేపీ వాదులు...ఈ చిత్రాన్ని ఒకసారి నిశితంగా చూడాలని రాగిణీ నాయక్ కోరారు. ఇది 12-13 ఏళ్ల నాటి ఫోటో, ఇందులో విజయ్ ఎన్ఎస్యూఐ జాతీయ కార్యవర్గ సభ్యులతో భుజం భుజం కలిపి నిలబడి ఉన్నారని తెలిపారు. ఇందులో అప్పటి తమ జాతీయ అధ్యక్షుడు హిబీ ఎడెన్, జాతీయ కార్యదర్శి గోపి, జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ బసోయా, మరో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాగిణీ నాయక్ కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+