అమెరికాకు రూ. 1,90,000 కోట్ల భారీ సాయం ప్రకటించిన భారత్.. ఇది నయా భారత్ బాసూ..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధి మూతపడింది. దాంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. పేద, మధ్య తరగతి, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటుగా ఇక అభివృద్ధి చెందిన దేశాలు కూడా అనేక ఇబ్బందులను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు భారత్ సాయం చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికాలో ఏకంగా రూ. రూ. 1.9 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత్ లోని పలు కంపెనీలు ముందుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచదేశాల నోట భారత్ మాట మరోసారి మారుమోగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో భారత్ శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలిశాయి. భారత రక్షణ వ్యవస్థ ప్రపంచదేశాలను అబ్బుర పరిచింది. ఆ తర్వాత తాజాగా మరోసారి భారత్ తన సత్తా ప్రదర్శించింది. అమెరికాలో భారత కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో భారత్ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని సంబోధించారు. ఇప్పుడు భారత్ అమెరికాకు సాయం చేసే స్థాయికి చేరుకోవడంతో ట్రంప్ పై ట్రోలింగ్స్ వస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్ ను డెడ్ ఎకానమీ అని అభివర్ణించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అలాగే అమెరికా వస్తువులపై భారత్ అధికశాతం పన్నులు విధిస్తోందన్న నెపంతో ఆ సమయంలో భారత్ పై ట్రంప్ అక్కసు వెళ్ళగక్కారు. భారత్ ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అని ఎద్దేవా చేశారు. అంతేకాక భారత్ నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 25 శాతం టారిఫ్ లను కూడా విధించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భారత్ కు చెందిన కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి.

భారత కంపెనీలు అమెరికాలో దాదాపు 23 బిలియన్ డాలర్లు అంటే రూ. 1,90,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ పెట్టుబడులు ప్రధానంగా టెక్నాలజీ, తయారీ, ఫార్మా రంగాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ పెట్టుబడులతో అమెరికాలో వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు భారత్ తన ఆర్థిక వ్యవస్థ సమర్థతను చాటుకుంటూనే అమెరికాకు సాయం చేసే స్థాయికి చేరిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications