గవర్నర్ వద్దకు జననాయగన్ నిర్మాత, విజయ్ కు కొత్త చిక్కులు..!!
తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తీసుకుంటున్నాయి. విజయ్ కు సీఎం పీఠం ఖాయమైనా.. ఇంకా తన చేతికి అందలేదు. ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. నెంబర్ గేమ్ ఇప్పుడు తమిళనాట ఉత్కంఠ పెంచుతోంది. రెండు సీట్ల దూరంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ఆగిపోయింది. ఇదే సమయంలో విజయ్ కీలక మంత్రాంగం సాగిస్తున్నారు. కాగా.. తాజాగా జననాయగన్ నిర్మాత ప్రస్తుత ప్రతిష్ఠంభన వేళ గవర్నర్ ను కలవటం కొత్త వివాదంగా మారింది.
విజయ్ ప్రభుత్వ ఏర్పాటు పైనా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తం 118 సీట్ల మెజార్టీ ఉంటే నే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. అందుకు అవసరమైన పూర్తి మెజార్టీ పైన స్పష్టత రావటంతో.. ఈ రోజు (శనివారం) విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా అంచనా వేసారు. అయితే, చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇంకా రెండు సీట్ల మద్దతు విజయ్ కు అవసరం. ఈ సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలోనే విజయ్ మరోసారి గవర్నర్ ను కలిసారు. ఆ సమయంలో విజయ్ తో పాటుగా జననాయగన్ నిర్మాత వెంకట నారాయణ ఉండటం పైన ప్రత్యర్ధి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే జననాయగన్ విడుదల పైన కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు వంటి కీలక అంశాల చర్చల వేళ గవర్నర్ వద్దకు విజయ్ తన సినిమా నిర్మాతను ఎలా తీసుకెళ్తారనే ప్రశ్నలు మొదలు పెట్టారు. దీని పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

విజయ్ పై విమర్శలు మొదలు
విజయ్ కు పార్టీ ఏర్పాటు నుంచి ప్రభుత్వం ఏర్పడే వరకు కొందరు ముఖ్యులు అన్నీ తామై తెర వెనుక వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ మూలాలు ఉన్న ఒక పారిశ్రామి వేత్త సైతం విజయ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా గవర్నర్ ను కలిసిన వారిలో ఆయన ఉన్నారు. ఇదే ఇప్పుడు విజయ్ కు సమస్యగా మారింది. వీరితో కలిసి విజయ్ గవర్నర్ వద్దకు వెళ్లటం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు వేళ సినీ నిర్మాతలు... వ్యాపారవేత్తలతో కలిసి చర్చలు ఏంటని నిలదీస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలోనూ టీవీకే అనుభవ రాహిత్యం.. పొరపాట్లు విజయ్ కు సమస్యగా మారుతున్నాయి. ఇప్పుడు గవర్నర్ వద్దకు వెళ్లిన సమయంలో వీరిని తీసుకెళ్లటం విజయ్ కు కొత్త సమస్యగా మారింది.













Click it and Unblock the Notifications