విజయ్ విజయం వెనుక పొలిటికల్ వ్యూహకర్త కపిల్ సాహు.. ఎవరీ కపిల్ సాహు?

ఎన్నికలలో పోటీ చేసిన మొదటిసారే ప్రభంజనం సృష్టించిన విజయ్ పార్టీ వెనుక పనిచేసిన స్ట్రాటజీ ఏంటి? విజయ్ కు పొలిటికల్ స్ట్రాటజీలను ఎవరు అందించారు? విజయ్ విజయ రహస్యం వెనుక కనిపించని ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అన్న ప్రశ్నలకు తెర దించుతూ తాజాగా ఒక పేరు తెరమీదకు వచ్చింది. పొలిటికల్ స్ట్రాటజీ రంగంలో కొత్త పేరు వినిపిస్తోంది. ఆ పేరు కపిల్ సాహు.

ఈ యువ స్ట్రాటజిస్ట్ విజయ్ విజయానికి కారణం

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ యువ రాజకీయ స్ట్రాటజిస్ట్ విజయ్ పార్టీ అయిన టీవికే విజయానికి దోహదం చేశారు. రాజకీయాలలో చరిత్ర సృష్టించిన విజయ్ పార్టీ కి తెరవెనుక ఉండి సహకారాన్ని అందించారు. ఎన్నికలలో పోటీ చేసిన తొలిసారి సునామీ సృష్టించేలా వ్యూహాలను ఇచ్చిన కపిల్ సాహు కొంతకాలం ఐ ప్యాక్ తో కలిసి పనిచేశారు.

kapil sahu vijay strategist plays a key role in the elections and candidates selection for tvk know about kapil sahu

గతంలో ఐ ప్యాక్ లో .. ఇప్పుడు స్వతంత్రంగా కపిల్ సాహు

ఒకరకంగా ప్రశాంత్ కిషోర్ కు సహచరుడిగా చెప్పవచ్చు. అయితే రెండు సంవత్సరాల క్రితం ఐ ప్యాక్ నుండి బయటకు వచ్చిన కపిల్ సాహో 12 మంది సభ్యులతో కోర్ టీం ఏర్పాటు చేసుకుని, స్వతంత్రంగా రాజకీయ సేవలను అందించడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు 9 రాష్ట్రాలలో వివిధ పార్టీలకు వ్యూహాలను రూపొందించిన అనుభవం ఆయనకు ఉంది.

టీవికే పార్టీకి ప్రధాన రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతలు

2024 లోనే టీవీకేతో తన సంబంధాలను కట్ చేసుకున్న ప్రశాంత్ కిషోర్, విజయ్ కు దూరమైన తర్వాత, కపిల్ సాహు టీం టీవికే పార్టీకి ప్రధాన రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బలాబలాల నివేదికలు అందించింది. పార్టీ నిర్మాణం, ఎన్నికల సర్వేలు, డేటా అనాలసిస్, డిజిటల్ క్యాంపెయిన్ స్ట్రాటజీ లు, మీడియా కమ్యూనికేషన్స్, విజయ్ ఎన్నికల ర్యాలీలు, ప్రచార వ్యూహాలు తదితర ముఖ్య పనులను చేసింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన కపిల్ సాహు

విజయ్ పార్టీ కి పని చేసిన కపిల్ సాహు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా బిజెపికి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి విజయాన్ని చేకూర్చారు. ప్రశాంత్ కిషోర్ తర్వాత భారతీయ రాజకీయాల్లో తనదైన మార్కు సృష్టిస్తున్న కొత్తతరం స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు విజయ్ విజయానికి కారణం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+