ప్రతిరోజూ రాత్రి అరగంట పవర్ కట్.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోని అనేక ప్రాంతాల్లో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నో పెట్రోల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో విద్యుత్ సంక్షోభం విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం కారణంగా కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అధికారికంగా విద్యుత్ నియంత్రణలను ప్రకటించింది.

కేరళలోని ప్రజలకు బిగ్ షాక్.. ఇకపై ప్రతిరోజూ అరగంట పాటు కరెంట్ కట్.. అది కూడా రాత్రి సమయంలో.. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సమయంలో కేరళ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు విద్యుత్ కోతలు ఉండనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉండే సమయంలో పంపిణీ వ్యవస్థ ఏమాత్రం దెబ్బతినకుండా ఉండేందుకు పీక్ లోడ్ మేనేజ్ మెంట్ పేరుతో ఈ విద్యుత్ నియంత్రణలను అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

అలాగే పవర్ కట్ కు సంబంధించిన వివరాలను ముందుగానే మెసేజ్ ద్వారా వినియోగదారులకు తెలియజేస్తున్నారు అధికారులు. ఈ మెసేజ్ విద్యుత్ నిలిపివేసే సమయాన్ని ముందుగానే వివరిస్తున్నారు. దాంతో ప్రజలు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారని స్పష్టం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పవర్ కట్ చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ముందస్తు సమాచారం కోసం మెసేజ్ ల రూపంలో అలర్ట్స్ పంపిస్తున్నారు అధికారులు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై మంత్రి కృష్ణన్ కుట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రప్రభుత్వం మరో 250 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సిద్ధం అవుతూందని దాంతో రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లోడ్ షెడ్డింగ్ కు అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు.

Kerala Government Announces Daily Power Cut Upto 30 Minutes Due to Severe Electricity Crisis Kerala

ఇక వేసవి కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్లలో నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేవలం 30 శాతం మాత్రమే ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎండల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+