బెంగాల్ లో జరగరానివి జరుగుతున్నాయ్
ఇంకొన్ని గంటల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తును ఈ ఫలితాలు నిర్ణయించనున్నాయి. ఎన్నికలకు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మమతకు అనుకూలంగా లేనప్పటికీ, నాలుగోసారి విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ను అధికార పీఠం నుంచి దించడానికి గట్టి ప్రయత్నాలే చేసింది.
ఈ పరిణామాల మధ్య మమతా బెనర్జీ కీలక ఆరోపణలు చేశారు. ఓట్ల లెక్కింపునకు ముందు రోజు రాత్రి స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల విద్యుత్ సరఫరా నిలిపివేశారని, సీసీటీవీ ఫుటేజీల కనెక్షన్లను తొలగించారని చెప్పారు. అనుమానాస్పద కార్యకలాపాలు అనేకం చోటు చేసుకున్నాయని విమర్శించారు. ఓట్ల లెక్కింపు సమయంలో పార్టీ ఏజెంట్లు ఏమరుపాటుగా ఉండకూడదని సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

హుగ్లీ, నాదియా, బర్ధమాన్, కోల్‌కతాలో లోడ్‌షెడ్డింగ్, సీసీటీవీ నిఘా అంతరాయాలపై నివేదికలు అందాయని మమత బెనర్జీ తెలిపారు. కార్యకర్తలు, ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని, అన్నింటినీ గమనించాలని కోరారు. హుగ్లీలోని శ్రీరాంపూర్, నాదియాలోని కృష్ణానగర్, బర్ధమాన్ ఆస్‌గ్రామ్, కోల్‌కతాలోని క్షుదిరామ్ అనుశీలాన్ కేంద్రం వరకు ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయని అన్నారు. ఇక్కడ విద్యుత్ సరఫరాను దశలవారీగా నిలిపివేస్తోన్నారని, సీసీటీవీలను ఆపివేస్తున్నారని అన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లలోకి ప్రైవేటు వాహనాలు వచ్చి, వెళ్తున్నాయని చెప్పారు.
সতর্ক থাকুন। পাহারা দিন। রাত জাগুন। অভিযোগ করুন।
— Mamata Banerjee (@MamataOfficial) May 3, 2026
বিভিন্ন জায়গা থেকে খবর পাচ্ছি, পরিকল্পিতভাবে লোডশেডিং করে দেওয়া হচ্ছে। হুগলির শ্রীরামপুর, নদীয়ার কৃষ্ণনগর থেকে বর্ধমানের আউশগ্রাম, কলকাতার ক্ষুদিরাম অনুশীলন কেন্দ্রে এরকম ঘটনা সামনে এসেছে যেখানে দফায় দফায় লোডশেডিং করা হচ্ছে,…
ఓట్లకు కాపలాగా ఉండాలని మమత బెనర్జీ తన పార్టీ కార్యకర్తలను మమత కోరారు. రాత్రంతా మేల్కొని స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రతను పర్యవేక్షించానని చెప్పారు. ఈవీఎంలన్నీ కౌంటింగ్ కేంద్రాలకు చేరేంత వరకూ స్ట్రాంగ్‌రూమ్‌లలో కాపలా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద స్థితిని సృష్టిస్తే, వారిని చుట్టుముట్టి, వెంటనే ఫిర్యాదు చేయాలని, సీసీటీవీ ఫుటేజీని అడగాలని అన్నారు. ఇవన్నీ కూడా బీజేపీ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications