ఫలితాలకు ముందే మమత కు బిగ్ షాక్, ఇక తప్పదు..!!
పశ్చిమ బెంగాల్ ఫలితాల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హోరా హోరీగా సాగిన బెంగాల్ సమరం లో గెలుపు పైన బీజేపీ.. టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రెండో విడత పోలింగ్ పూర్తయిన తరువాత కౌంటింగ్ సెంటర్ ధర్నాకు దిగిన మమతా.. బీజేపీ పైన తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు. కౌంటింగ్ విధుల్లో మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర సిబ్బంది నియామకం పైన సీఎం మమతా న్యాయస్థానం ను ఆశ్రయించారు. మమతా పిటీషన్ పైన సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఫలితాలకు ముందే మమతకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి.
సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతకు షాక్ తగలింది. ఈ నెల 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ లో కేంద్ర సిబ్బందిని ఎన్నికల సంఘం మైక్రో అబ్జర్వర్లుగా నియమించింది. కేంద్రం పరిధిలో పని చేసే వారిని మైక్రో అబ్జర్వర్లుగా నియమించటం పైన మమతా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. కాగా.. దీని పైన అత్యవసర విచారణ చేయాలని మమతా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ తరువాత సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మమతా దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించింది. కేంద్ర ఉద్యోగులు సైతం విధుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి విధులు నిర్వహిస్తారని.. వారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండవని కోర్టు అభిప్రాయ పడింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది.

సుప్రీం తాజా ఆదేశాలతో
కౌంటింగ్ లో మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులు ఎందుకు ఉండకూడదని సుప్రీం ప్రశ్నించింది. ఇదే కేసులో ఎన్నికల సంఘం సైతం తమ వాదన వినిపించింది. రాష్ట్రంలో కౌంటింగ్ కోసం రాష్ట్ర సిబ్బందితో పాటుగా కేంద్ర ఉద్యోగులను వినియోగిస్తున్నామని వివరించింది. దీంతో... కౌంటింగ్ ప్రక్రియలో కేంద్ర సిబ్బంది మైక్రో అబ్జర్వర్లుగా కొనసాగటానికి లైన్ క్లియర్ అయింది. రెండో విడత పోలింగ్ నుంచి బీజేపీ లక్ష్యంగా మమతా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ గుండాగిరీ చేస్తోందని విమర్శించారు. ఏం చేసినా ఈ ఎన్నికల్లో తాము గెలవటం ఖాయమని మమతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తమ కార్యకర్తలతో గస్తీ ఏర్పాటు చేసారు. ఇక.. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడి కానున్న వేళ.. చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయం గా ఉత్కంఠ పెంచుతున్నాయి.













Click it and Unblock the Notifications