విజయ్ కు రాహుల్ ఫోన్ కాల్..! ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు?
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా విడుదలయ్యాయి. ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఫలితాల్లో ఆధిక్యం ప్రదర్శించిన విజయ్ (Vijay) పార్టీ టీవీకే (Tvk).. తమిళనాడులో కొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 107 సీట్లు కైవసం చేసుకుంది. ఇందులో తాజా వార్తలందేసరికి 91 సీట్లలో గెలిచి మరో 16 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూటమి కడదామంటూ ఆఫర్ ఇచ్చారు.
విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఈ ఆఫర్ ఇచ్చిన గంటల్లోనే కేంద్రంలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. విజయ్ కు ఫోన్ కాల్ చేశారు. తమిళనాడులో సాధించిన ఘన విజయంపై విజయ్ కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు విజయ్ తో మాట్లాడినట్లు రాహుల్ ట్వీట్ చేశారు. ఈ తీర్పు పెరుగుతున్న యువత గళాన్ని ప్రతిబింబిస్తుందని, దీనిని విస్మరించలేమని, విస్మరించబోమని రాహుల్ తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ కార్యకర్తల కృషికి, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలను రక్షించడం, వారికి సేవ చేయడం కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.

I spoke to Thiru Vijay and congratulated him on TVK’s spectacular result.
— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2026
This mandate reflects the rising voice of youth which cannot, and will not, be ignored.
My heartfelt thanks to the Congress workers of Tamil Nadu and Puducherry for their hard work and support.
I…
మరోవైపు విజయ్ తో ఫోన్ కాల్ లో రాహుల్ గాంధీ.. తమిళనాడులో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజయ్ తండ్రి చంద్రశేఖర్ చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు విజయ్ కు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి 5 సీట్లు సాధించింది. విజయ్ పార్టీ టీవీకే సాధించిన 107 సీట్లకు కాంగ్రెస్ 5 సీట్ల మద్దతు ఇచ్చినా మ్యాజిక్ మార్క్ సాధించాలంటే మరో 6 సీట్లు అవసరం. దీంతో మరికొన్ని చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై రేపు, ఎల్లుండిలో క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications