విజయ్ ప్రభంజనం.. విజయ్ రాజకీయ వ్యూహకర్తపైనా, TVKలో అభ్యర్థుల ఎంపిక వెనుక చర్చ!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనాలు నమోదు చేసే దిశగా సాగుతున్నాయి తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి అధికారాన్ని నిలబెట్టుకున్న అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తే ఆ అంచనాలను తారుమారు చేస్తూ ప్రస్తుతం విజయ్ పార్టీ టీవీకే దూసుకుపోతోంది.

విజయ్ పార్టీకి ఊహించని ఫలితాలు

విజయ్ పార్టీ దాదాపు 110 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఫలితాల ట్రెండును బట్టి విజయ్ పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలలో తొలి ప్రయత్నంలోనే విజయ్ ఊహించని విధంగా దూసుకుపోవటం వెనుక విజయ్ రాజకీయ వ్యూహకర్త ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.

tamilnadu election results Who is tvk chief Vijay Political Strategist know Who Decided Candidates in TVK

విజయ్ కోసం పని చేసిన రాజకీయ వ్యూహకర్తలు వీరే

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మొదట్లో టీవీకే పార్టీకి ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు, తర్వాత ఆయన సహచరుడు, ఐ ప్యాక్ నుండి బయటకు వచ్చిన ఒక టీమ్ పని చేశారని, ప్రశాంత్ కిషోర్ సహచరుడు అయిన కీలక వ్యక్తి ఇచ్చిన సూచనలు, సలహాలతోనే విజయ్ వ్యూహాలు ఫలించాయని, అందుకే ఫలితాలు ఈ విధంగా వస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

TVK వ్యూహాలలో వీరి పాత్ర

జాన్ అరోకియాసామి TVK వ్యూహాలలో కీలక భూమిక పోషించారు. ఆధవ్ అర్జున్ TVKలో ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శిగా పార్టీ 'వార్ రూమ్' కార్యకలాపాలు మరియు సర్వే వ్యూహాలను పర్యవేక్షించారు. తెర వెనుక విజయ్ కు సహాయం చేసినవారు ప్రత్యర్ధుల దృష్టిలో పడకుండా జాగ్రత్త పడ్డారు.

వ్యూహాత్మక నిర్ణయాల వెనుక ఆయనదే ఆలోచన

టీవికేకి అధికారికంగా ఫలానా రాజకీయ వ్యూహకర్త ఉన్నారు అన్న పేరు బయటకు రానప్పటికీ విజయ్ కోసం పని చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరన్నది ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల వ్యూహకర్తల సలహాలు మాత్రమే కాదు, ఎన్నికల వ్యూహాలపై పూర్తి నిర్ణయం తీసుకునే అధికారం విజయ్ కి ఉండడంతో ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల ఎంపిక వెనుక భారీ కసరత్తు

టీవీకే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీలో కూడా ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలు,గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ టీమ్స్ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల పైన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి, విజయ్ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసి తుది నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. డ్రైవర్ కొడుకు నుండి, అత్యంత విద్యావంతుల వరకు క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న వాళ్ళని అభ్యర్థులుగా నిలబెట్టి బరిలోకి దిగిన విజయ్ ప్రస్తుతం విజయాలను నమోదు చేసే దిశగా ముందుకు వెళుతున్నారు. తొలి ప్రయత్నంలోనే తమిళనాట సంచలనాలను నమోదు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+