విజయ్ కు ఊహించని ఫలితాలు, పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ..!!
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కు ఇప్పటి వరకు ఆశించిన ఫలితం కనిపించటం లేదు. తొలి ట్రెండ్స్ క్లియర్ గా ఉన్నాయి. అధికార డీఎంకే ఇప్పటికే ఆధిక్యత లో కొనసాగుతోంది. అన్నా డీఎంకే రెండో స్థానంలో ఉండగా.. విజయ్ టీవీకే మూడో స్థానంలో నిలిచింది. విజయ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానంలో ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో వెనుకంజలో ఉన్నారు. దీంతో... ఎగ్జిట్ పోల్స్ నిజం కానున్నాయా... లేక, ఈవీఎం ల లెక్కింపులో విజయ్ దూసుకు వస్తారా అనేది ఉత్కంఠగా మారుతోంది.
తమిళనాట తొలి ఫలితాల పై స్పష్టత వస్తోంది. ట్రెండ్స్ ప్రజా నాడిని వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయా లేదా అనే టెన్షన్ వేళ వాస్తవ ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్.. ఆ తరువాత ఈవీఎం ల కౌటింగ్ ప్రారంభించారు. తొలి ఫలితాల్లో డీఎంకే 46, అన్నా డీఎంకే 18, టీవీకే 7 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతన్నారు. టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేసిన పెరంబూర్ లో ఆధిక్యతలో ఉన్నారు. రెండో స్థానం తిరుచ్చి ఈస్ట్ లో వెనుకంజలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్ లీ డీఎంకే లీడ్ లో ఉంది. ఎప్పుడూ ద్విముఖ పోరు జరిగే తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు సాగింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలే శాసిస్తుండగా.. వీటి మధ్యలోకి ఈసారి'తమిళ వెట్రి కళగం' (టీవీకే) పార్టీతో సినీనటుడు విజయ్ ప్రవేశించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించగా.. 85.10శాతం పోలింగ్ నమొదైంది.

విజయ్ తొలి ట్రెండ్స్ నిరాశ
సీఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకేదే ఈసారి కూడా అధికారమని మె జారిటీ ఎగ్జిట్‌పోల్ సర్వేలు ప్రకటించాయి. 'యాక్సిస్ మై ఇండియా' మాత్రం విజయ్ పార్టీ ఏకంగా 120 వరకు సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకత తమను గెలిపిస్తుందన్న ఆశతో ఉంది. ఒకవేళ విజయ్ పార్టీ గెలిస్తే తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం మొదలైనట్లే. కాగా, రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశముందన్న అంచనాలతో దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేశారు. గెలిచేవారంతా వెంటనే పార్టీ ప్రధాన కార్యాలయంలో రిపో ర్టు చేయాలని ఆదేశించారు. వారిని ఓ రిసార్టుకు తరలించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అయితే, వస్తున్న ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications