విజయ్ అన్నా.. త్రిషతో జాగ్రత్త..! సంచలన వీడియో వైరల్..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ సంచలనం సృష్టించారు. విజయ్ టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో హవా చూపిస్తోంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్ నెలకొల్పిన రికార్డును దాదాపు 50 ఏళ్ల తర్వాత విజయ్ సృష్టించడంతో యావత్ దేశం చూపు ఇప్పుడు విజయ్ వైపు ఉంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో మరో నూతన అధ్యాయం మొదలైంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను విజయ్ టీవీకే పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన పూర్తి మెజారిటీ వస్తుందా..? లేదా..? అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, దళిత్ ఓటర్లను ఆకర్షించడంలో విజయ్ విజయవంతం అయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ ఎన్నికల్లో విజయ్ రెండు చోట్ల పోటీ చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల్లోనూ విజయ్ విజయం సాధించారు. అయితే విజయ్ ఈ రెండు చోట్లలో ఓ స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. దేశ రాజకీయ చరిత్రలో ఇలా ఎంతోమంది నాయకులు ఒకటికి మించి స్థానాలలో పోటీ చేశారు. గెలిచిన తర్వాత కొన్ని స్థానాలను వదులుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి విజయ్ కూడా చేరబోతున్నారు. అయితే విజయ్ ఓ స్థానాన్ని త్రిషకు ఇస్తారా..? లేదా మరొకరికి ఇస్తారా..? అనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు త్రిష కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు. త్రిష గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని చెప్పిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇక త్రిష రాజకీయ భవిష్యత్తు గురించి విజయ్ కచ్చితంగా ఆలోచిస్తారని ఆమెకు లాభం చేకూర్చే పని చేస్తారని తమిళనాడు మీడియాలో కథనాలు వెల్లడవుతున్నాయి. మరోవైపు త్రిష నటించిన ధర్మయోగి చిత్రంలోని వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో త్రిష పూర్తి నెగిటివ్ షెడ్ లో ఉన్న పాత్రలో నటించారు. ఈ సినిమా మొత్తం రాజకీయ అంశాల చుట్టూనే తిరుగుతుంది. త్రిష తన రాజకీయ ఎదుగుదల కోసం హీరో ధనుష్ తో ప్రేమ నటిస్తుంది. ఆ తర్వాత అతడిని చంపేస్తుంది. ధనుష్ తమ్ముడు త్రిషను అంతం చేయడంతో ఈ సినిమా కథ ముగుస్తుంది. ఇక గతంలో త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని తెలిపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో త్రిష తను సీఎం అవ్వడానికి ఏ పనైనా చేస్తుందని.. అందువల్లే ఆమెతో జాగ్రత్తగా ఉండాలని విజయ్ అభిమానులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications