రెండు స్థానాల్లోనూ విజయ్ గెలుపు, ఒక సీటు 'ఆమె' కే త్యాగం - చిరంజీవి, పవన్ నాడు..!!

తమిళనాడు లో విజయ్ ప్రభంజనం కొనసాగుతోంది. 109 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా టీవీకే ఆవిర్భవించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి అవసరమైన 118 స్థానాలకు దగ్గరగా విజయ్ అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో అధికర డీఎంకే రెండో స్థానంలో.. అన్నా డీఎంకే కూటమి మూడో స్థానంలో ఉన్నాయి. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయ్ గెలుపొందారు. సీఎం స్టాలిన్ ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఇక.. ఇప్పుడు పొత్తుల లెక్కలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు లో కీలకంగా మారుతున్నాయి.

తమిళనాడలో విజయ్ దెబ్బ రెండు ప్రధాన పార్టీల ఆశలు వమ్ము చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ సొంత నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. విజయ్ పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి గెలుపొందారు. ఇక.. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల మేరకు విజయ్ పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. అధికారం దక్కాలంటే 118 స్థానాలు రావాల్సి ఉంది.

Vijay emerges as the winner in Tiruchhi East and Perambur segments as per the latest reports

పూర్తి స్థాయి ఫలితాల తరువాత ఎవరెవరు పొత్తు తో ప్రభుత్వం ఏర్పడేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తంోది. క్రమేణా పుంజుకున్న డీఎంకే 72 స్థానాలు దక్కించుకుంది. అన్నా డీఎంకే కూటమి 53 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. విజయ్ కు అన్నా డీఎంకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. పొత్తుల విషయంలో విజయ్ తండ్రి కాంగ్రెస్ కు చేసిన రిక్వెస్ట్ కీలకంగా మారింది. అయితే, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపించటం లేదు.

కాగా.. విజయ్ గెలిచిన రెండు స్థానాల్లో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ సీటును సినీ నటి త్రిష కు కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. విజయ్ గెలుపు కోసం త్రిష తెర వెనుక కీలక పాత్ర పోషించారు. ఈ రోజు తన జన్మదినం.. విజయ్ గెలుపు రోజు కావటంతో.. స్వయంగా వచ్చి విజయ్ కు అభినందనలు తెలిపారు. ఇక.. ఇదే సమయంలో గతంలో ఏపీలో చిరంజీవి.. పవన్ తొలి సారి ఎన్నికల్లో పోటీ చేసి ఎదుర్కొన్న ఫలితాల పైనా సోషల్ మీడియాలో చర్చ సాగు తోంది.

చిరంజీవి 2009 లో తిరుపతి, పాలకొల్లు నుంచి ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో గెలిచిన చిరంజీవి, పాలకొల్లులో ఓడిపోయారు. ఇక.. 2014 లో ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ- టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ 2019 ఎన్నికల్లో తొలి సారి ఎన్నికల్లో పోటీకి దిగారు. గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇప్పుడు విజయ్ తొలి సారి పోటీ చేసి రెండింటా గెలవటంతో.. ఈ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. విజయ్ ఎవరి మద్దతుతో అధికార చేపడుతారనేది ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+