Iran War: యుద్ధం మార్చిన లెక్క-బలపడ్డ ఇరాన్-బయటపడ్డ గల్ఫ్ డొల్లతనం..!

ఇరాన్ పై అమెరికా మొదలుపెట్టిన యుద్దం (iran war) ప్రస్తుతం దారీతెన్నూ లేకుండా మారిపోయిందని ప్రపంచం అంచనా వేస్తోంది. దీనికి కారణం రెండో నెలకు చేరుకున్నా యుద్దం ముగింపు సంకేతాలు లేకపోవడం. ఇరాన్ అస్సలు వెనక్కి తగ్గకపోవడం. అయితే ఈ యుద్దం వల్ల మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. ముఖ్యంగా నిన్న మొన్నటివరకూ అమెరికా నీడలో భద్రంగా ఉన్నాయని భావించిన గల్ఫ్ దేశాల డొల్లతనం బయటపడింది. అదే సమయంలో ఇరాన్ ను దెబ్బతీద్దామన్న అమెరికా-ఇజ్రాయెల్ ప్రయత్నాలు వికటించి ఆ దేశం ఇప్పుడు ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది.

ఇరాన్ వార్ లో తప్పిన లెక్కలు (iran war)

ఇరాన్ పై యుద్దం మొదలుపెట్టే నాటికి అమెరికా-ఇజ్రాయెల్ లెక్క ప్రకారం ఆ దేశంలో కీలక నాయకుల్ని చంపేసి, దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని, అక్కడ తమ చెప్పుచేతల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇందులో మొదటి దశ అయిన కీలక నేతల హత్యలు తొలిరోజే జరిగిపోయాయి. దీంతో ఇరాన్ రెండు, మూడు రోజుల్లో లొంగిపోతుందని అమెరికా భావించింది. అక్కడే లెక్క తప్పింది. సుప్రీంలీడర్ ఆయతుల్లా ఖొమైనీ దారుణ హత్యతో రగిలిపోయిన ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అవి ఏ స్ధాయిలో ఉన్నాయంటే అమెరికాతో పాటు ఆ దేశ సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇచ్చిన గల్ఫ్ దేశాలూ వణికేంతగా. భద్రతా హామీలు లేకుండా యుద్ధం మధ్యలో ఆగిపోతే.. గల్ఫ్ దేశాలు తీవ్ర ప్రమాదంలో పడతాయి. భవిష్యత్ ఇరాన్ ప్రతీకారం ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకపోవచ్చు. టెహ్రాన్ తన దశాబ్దాల పురాతన ప్రపంచ నెట్‌వర్క్‌లను ఉపయోగించి, యుద్ధభూమికి దూరంగా ఇజ్రాయెల్, అమెరికా, మిత్రదేశాల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవడానికి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

The Irony of War Why Conflict Intended to Cripple Iran May Strengthen It and Endanger the Gulf

బలపడిన ఇరాన్

అమెరికా ఇప్పుడు యుద్దం మధ్యలో అపేసి పారిపోలేని పరిస్ధితి, అలాగని చర్చల పేరుతో లాబీయింగ్ మొదలుపెట్టి ఏదో విధంగా బయటపడదామంటే అదీ కుదరని దుస్దితి, చివరికి హార్ముజ్ జలసంధి తెరపించడమూ వద్దు, ఇరాన్ తో ఒప్పందమూ వద్దు రెండు వారాల్లో యుద్దం ముగిస్తామంటూ ట్రంప్ పదే పదే ప్రకటనలు చేయాల్సిన స్దితి. దీంతో ఈ యుద్దంలో ఎవరు గెలిచారో ఇప్పుడు ప్రపంచంలో పసిపిల్లాడు కూడా చెప్పేస్తున్నాడు. స్పష్టమైన హామీలు లేకుండా యుద్ధం ముగియడం గల్ఫ్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ఈ ప్రాంతం ఇరాన్‌కు లాభదాయకంగా ముగుస్తున్న యుద్ధం యొక్క పరిణామాలను భరించాల్సి వస్తుంది. ఇరాన్ ఈ యుద్ధంలో విజయం సాధించకపోయినా.. షిప్పింగ్ మార్గాలను, ఇంధన ప్రవాహాలను, ప్రాంతీయ స్థిరత్వాన్ని బెదిరించే సామర్థ్యంతో బలపడగలదని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీనివల్ల గల్ఫ్ దేశాలపై ఆర్థిక, వ్యూహాత్మక భారం పెరుగుతుంది.

The Irony of War Why Conflict Intended to Cripple Iran May Strengthen It and Endanger the Gulf

గల్ఫ్ దేశాలకు ఇక ఇబ్బందులే?

ఇరాన్ ను దారుణంగా దెబ్బతీసేందుకు మొదలుపెట్టిన ఈ యుద్దం వికటించి ఆ దేశం ఎన్నడూ లేనంత బలోపేతంగా మారిపోయింది. అలాగే ఇన్నాళ్లూ భద్రంగా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టిన గల్ఫ్ దేశాల డొల్లతనం బయటపడింది. అలాగని ఇరాన్ పై ఇప్పుడు ఎదురుదాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాల నుంచి వ్యతిరేకత తప్పదన్న భయాలు గల్ఫ్ దేశాల్ని తేలుకుట్టిన దొంగల్లా మార్చేశాయి. దీంతో ఇప్పుడు యుద్దం ముగిసినా హార్ముజ్ జలసంధి తెరుచుకునేలా కనిపించడం లేదు. అలాగే మధ్యప్రాచ్యంలో ఇకపై ఇరాన్ దే ఆధిపత్యం అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇజ్రాయెల్ ఇకపై పాలస్తీనా, గాజాల్ని ముట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్ధితి. దీంతో ట్రంప్ కు, ఆయన మిత్రుడు నెతన్యాహుకు ఇరాన్ యుద్దం ఇప్పుడు ప్రాణసంకటంగా మారిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+