ఆర్టీసీ సమ్మె వేళ మెట్రో కీలక నిర్ణయం- స్పెషల్ సర్వీసులు, టైమింగ్స్..!!
ఆర్టీసీ సమ్మె సామాన్యులకు సమస్యగా మారింది. డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఆటోలు.. క్యాబ్ ఓనర్లు ప్రయాణీకుల అవసరం అవకాశంగా మలచుకుంటున్నారు. ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సెట్విన్ సర్వీసులు రోడ్ల మీదకు వచ్చాయి. ప్రభుత్వం సమ్మె విరమణ చేయాలని కార్మిక సంఘాలను కోరుతోంది. కార్మికులు మాత్రం తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో.. హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు పెంచేందుకు మెందుకు వచ్చింది. మెట్రో వేళలను పొడించింది.
ఆర్టీసీ సమ్మె ప్రభావం హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఉంది. నిత్యం లక్షలాది మంది ఆర్టీసీ బస్సుల ద్వారానే గమ్య స్థానాలకు చేరుకుంటారు. దీంతో.. సమ్మె కారణంగా ప్రభుత్వం ప్రయివేటు వాహనాలకు నగరంలో అనుమతి ఇస్తోంది. క్యాబులు.. ఆటోలు భారీగా ఛార్జీలు వసూలు చేస్తు న్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలకు సిద్దమైంది. ఇటు ప్రయాణీకులు ఎండల తీవ్రత వేళ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. మెట్రో ప్రయాణీకుల కోసం కీలక ప్రకటన చేసింది. టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచాలని నిర్ణయించారు. ఆర్టీసీ సమ్మె ముగిసేవరకూ 56 మెట్రో రైళ్లను నడపనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.

మెట్రో తాజా ప్రకటనతో
తాజా నిర్ణయం మేరకు మియాపూర్- ఎల్.బి.నగర్ కారిడార్‌లో 4 నిమిషాల 20 సెకన్ల విరామంతో, అలాగే నాగోల్- రాయదుర్గం కారిడార్‌లో 3 నిమిషాల 40 సెకన్ల విరామంతో రోజంతా గరిష్ఠంగా 56 రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. చివరి మెట్రో రైలు సర్వీస్ రాత్రి 11 గంటల తర్వాతా పొడిగించేలా చర్యలు చేపట్టినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా MMTS సర్వీసు లను పెంచాలని ప్రభుత్వం రైల్వే అధికారులను కోరింది. మెట్రో రైళ్లన్నీ ఉదయం నుంచి పూర్తి రద్దీగా మారాయి. అటు ప్రయివేటు వాహనాలు ఇష్టానుసారం దోచుకుంటున్నాయి. దీంతో.. మెట్రో తాజా నిర్ణయం కొంత మేర రిలీఫ్ గా మారనుంది. అయితే.. ఆర్టీసీ బస్సుల సమ్మె కారణంగా మహిళా ప్రయాణీకులకు ఉచిత ప్రయాణం నిలిచిపోయింది. అదనపు ఛార్జీలతో గమ్య స్థానాలకు చేరుకోవాల్సి వస్తోంది. సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications