Viral Video: హైదరాబాద్ లో అర్ధరాత్రి ఒంటరిగా వాకింగ్ చేస్తుండగా.. ఈమె చెప్పింది వింటే..!

సాధారణంగా రాత్రిళ్లు మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడిపోతారు. ఏ పని ఉన్నా సాయంత్రానికి ముగించుకుని ఇంటికి వచ్చేస్తుంటారు. ఇక పెద్ద పెద్ద నగరాల్లో అయితే అర్ధరాత్రి బయటకు రావాలంటేనే వామ్మో అనేస్తుంటారు. కానీ ఇప్పుడున్న ఉద్యోగాల ప్రకారం రాత్రి, పగలు అని తేడా లేకుండా బయటకు వెళ్లి రావాల్సిన పరిస్థితి. ఒక్కోసారి రూమ్ కు వచ్చేసరికి అర్ధరాత్రి కూడా అవుతుంది. అయితే హైదరాబాద్ లో ఓ మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ.. సిటీలో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో ఆమె రాత్రి 11 గంటలకు హైదరాబాద్ రోడ్లపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఇక్కడి ప్రజలు, తన అనుభవాల గురించి మాట్లాడారు. హైదరాబాద్ లో నైట్ వాకింగ్ మంచి అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. తాను ఒంటరిగా అర్ధరాత్రి వెళ్తున్నా.. ఎవరూ తనను ఇబ్బంది పెట్టలేదని.. తనను ఎవరూ ఫాలో చేసి వేధించలేదని చెప్పుకొచ్చారు. ఇక్కడ చాలా సేఫ్ గా ఉందని.. తాను అనుకున్న దాని కంటే హైదరాబాద్ చాలా అద్భుతంగా.. ప్రశాంతంగా ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు. తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

లీషా అనే మహిళ హైదరాబాద్ లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే సరదాగా బయటకు వెళ్లిన ఆమె అర్ధరాత్రి 11 గంటల సమయంలో అలా వాకింగ్ చేసుకుంటూ తన రూమ్ కు వెళ్లారు. అదే సమయంలో ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో హైదరాబాద్ లైఫ్ అనుభవాల గురించి ప్రస్తావించారు. ఈ నగరం చాలా సురక్షితమైనది, సో వెల్ కమింగ్ అని పొగిడారు. తాను ఊహించిన దానికంటే హైదరాబాద్ చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. తాను జాబ్ కోసం ఇక్కడకు వచ్చానని.. ముఖ్యంగా మహిళలకు ఈ నగరం చాలా సురక్షితం అని పేర్కొన్నారు. తాను అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు.

hyderabad Midnight Safety Woman Viral Video Walkthrough Declares the City Extremely Safe for Women

ఇక హైదరాబాద్ లో పగలు ఎండల కారణంగా హాట్ గా ఉన్నా సాయంత్రం చల్లగా, ప్రశాంతంగా ఉందని లీషా పేర్కొన్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు చాలా అభివృద్ధి చెందాయన్నారు. ఇక్కడి ప్రజలు చాలా మర్యాదగా మాట్లాడతారని వివరించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ అని వేరే ప్రాంతానికి వెళ్లాలని తాను మొదట అనుకున్నానని కానీ ఇక్కడకు వచ్చాక నా దృక్పథం మారిందన్నారు. ఆమె ఒంటరిగా దాదాపు 4 కిలోమీటర్లు నడుస్తూ ఈ వీడియో చేశారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+